Three dead, five injured in Visakhapatnam building collapse - Sakshi
Sakshi News home page

విశాఖలో కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం.. ముగ్గురు మృతి..

Published Thu, Mar 23 2023 7:14 AM | Last Updated on Thu, Mar 23 2023 3:21 PM

Visakapatnam Buliding Collapse Several Dead Many Injured - Sakshi

సాక్షి, విశాఖపట్నం:  నగరంలోని పాత రామజోగిపేటలో ఘోర ప్రమాదం జరిగింది. మూడు అంతస్తుల భవనం కుప్పకూలి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. వారికి ఎమర్జెన్సీ వార్డులో అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు.

అయితే వారికి ఎటువంటి ప్రాణాప్రాయం లేదని కేజీహెచ్ సూపరింటెండెంట్‌ అశోక్ కుమార్ తెలిపారు. వారందరికీ మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నామన్నారు. తెల్లవారుజామున 2 గంటలకు ప్రమాదం జరగడంతో తమకేమీ గుర్తులేదని గాపడిన వారు అంటున్నారు.  వారు ఇంకా ఆ షాక్ నుంచి కోలుకోలేని పరిస్థితి నెలకొంది. ఆ భయంతో మాట్లాడలేని పరిస్థితి  ఏర్పడింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement