ఇటీవల మజ్‌గావ్ భవన దుర్ఘటన వల్ల భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరిగిన నేపథ్యంలో శిథిలస్థితిలో ఉన్న భవనాలపై మరోసారి సర్వే కోసం నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాలని బీఎంసీ నిర్ణయించింది.
ముంబై: ఇటీవల మజ్‌గావ్ భవన దుర్ఘటన వల్ల భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరిగిన నేపథ్యంలో శిథిలస్థితిలో ఉన్న భవనాలపై మరోసారి సర్వే కోసం నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాలని బీఎంసీ నిర్ణయించింది. బీఎంసీ కార్యనిర్వాహక ఇంజనీర్లు, ప్లానింగ్ నిపుణులతో కూడిన ఈ బృందం సీ1, సీ2 విభాగాలలోని భవనాలను మరోసారి తనిఖీ చేస్తుంది. సీ1 విభాగంలో 95 భవనాలు శిథిలావస్థలో ఉన్నాయని ఇది వరకే గుర్తించారు. వీటిని కూల్చేయాలనే ప్రతిపాదనలూ ఉన్నాయి. సీ2లోనూ 11 భవనాలు కూలి పోయే స్థితిలో ఉన్నాయి. సీ2ఏ విభాగంలోని 40 భవనాలకు అత్యవసర మరమ్మతులు అవసరమని నిర్ధారించారు. సీ1లోని 95 భవనాల్లో 54 భవనాలను బీఎంసీ ఇది వరకే ఖాళీ చేయిం చింది. ఈ మూడు విభాగాల్లోని ఇంకా ఏవైనా భవనాలను ప్రమాదకరంగా ఉన్నదీ లేనిదీ నిర్ధారించడానికే తాజాగా సర్వే నిర్వహిస్తున్నామని అదనపు మున్సిపల్ కమిషనర్ ఎస్వీఆర్ శ్రీని వాస్ అన్నారు.