
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో పండగపూట విషాదం చోటుచేసుకుంది. నాలుగంతస్తుల భవనం కూప్పకూలడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం రాత్రి జరిగింది. వివరాలు.. ఢిల్లీలోని సీలంపుర్‌లో నిర్మాణంలో ఉన్న భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల్లో కూరుకుపోయిన రెండు మృతదేహాలను బయటకు తీశారు. ఇప్పటివరకు శిథిలాల కింద చిక్కుకుపోయిన ఆరుగురిని రక్షించగలిగామని ఫైర్ సిబ్బంది తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. నిర్మాణంలో ఉన్న సదరు భవనంలో కొంతమంది ఓ వేడుకలో పాల్గొన్న సమయంలో ఈ ఘటన జరిగిందని స్థానికులు చెప్పారు.
#UPDATE Delhi: Four-storey building collapses in Seelampur, several feared trapped. Rescue operation underway. https://t.co/4BxnExaQ0C pic.twitter.com/zrCg9B4POl
— ANI (@ANI) September 2, 2019