సాక్షి, విశాఖపట్నం: అది పురాతనమైన భవనం.. దాదాపు నాలుగు దశాబ్దాల కిందట అప్పటి నిర్మాణ పద్ధతిలో ఆ భవనాన్ని నిర్మించారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ భవనం పూర్తిగా నానిపోయి.. దెబ్బతిన్నది. మంగళవారం బలమైన ఈదురుగాలులు వీయడంతో చిగురుటాకులా వణికిపోయిన ఆ భవనం అందరూ చూస్తుండగానే.. క్షణాల్లో కుప్పకూలింది.
నిలువునా కూలి నేలమట్టమైంది. చాలాకాలంగా ఆ భవనంలో ఎవరూ నివసించడం లేదు. దీంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం మండలం నాతవరంలో చోటుచేసుకుంది. బలమైన ఈదురుగాలులకు స్థానికులు చూస్తుండగానే క్షణాల్లో పురాతన భవనం కుప్పకూలింది.
కుప్పకూలిన పురాతన భవనం
Published Tue, Oct 3 2017 11:41 AM | Last Updated on Thu, May 3 2018 3:20 PM
Advertisement
Advertisement