Natavaram
-
ఈదురుగాలులకే.. క్షణాల్లో.. చూస్తుండగానే..
సాక్షి, విశాఖపట్నం: అది పురాతనమైన భవనం.. దాదాపు నాలుగు దశాబ్దాల కిందట అప్పటి నిర్మాణ పద్ధతిలో ఆ భవనాన్ని నిర్మించారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ భవనం పూర్తిగా నానిపోయి.. దెబ్బతిన్నది. మంగళవారం బలమైన ఈదురుగాలులు వీయడంతో చిగురుటాకులా వణికిపోయిన ఆ భవనం అందరూ చూస్తుండగానే.. క్షణాల్లో కుప్పకూలింది. నిలువునా కూలి నేలమట్టమైంది. చాలాకాలంగా ఆ భవనంలో ఎవరూ నివసించడం లేదు. దీంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం మండలం నాతవరంలో చోటుచేసుకుంది. బలమైన ఈదురుగాలులకు స్థానికులు చూస్తుండగానే క్షణాల్లో పురాతన భవనం కుప్పకూలింది. -
ఈదురుగాలులకే.. క్షణాల్లో.. చూస్తుండగానే..
-
మాఫియా బరితెగింపు
లేటరైట్ మాఫియా బరితెగిస్తోంది. నర్సీపట్నం ఆర్డీవో, గనులశాఖ అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా లేటరైట్ మట్టి తరలింపును ఆపేయాలన్న అధికారుల ఆదేశాలను పట్టించుకోవడం లేదు. రాజకీయనాయకుల అండతో టిప్పర్లలో శుక్రవారం వేరే చోటుకి తరలించేశారు. నాతవరం : ఇటీవల నాతవరం మండలం సరుగుడు పంచాయతీలో లేటరైట్ తవ్వకాలపై వరుస కథనాలు సాక్షిలో ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఈమేరకు నర్సీపట్నం ఆర్డీవో కె.సూర్యారావు లేటరైట్ తవ్వకాల ప్రాంతాన్ని పరీశీలించారు. అసమయంలో పెద్ద ఎత్తున నిల్వ చేసిన లేటరైట్ మట్టితో పాటు టిప్పర్లు, ఇతర యంత్రాలు ఉన్నాయి. అనుమతులు లేకుండా తవ్వకాలు చేపడుతున్నారంటూ, కలెక్టరు అదేశాలు వచ్చే వరకు వాహనాలు, లేటరైట్ మట్టిని తరలించరాదని సూచించారు. మిషనరీతో పాటు ఇక్కడ పని చేస్తున్న సిబ్బందిని సైతం వీడియో తీయాలంటూ తహసీల్దార్ కనకారావును ఆదేశించారు. దీనిపై రెవెన్యూ సిబ్బంది నిఘా పెట్టాలని ఆదేశించారు. గురువారం జియాజిస్టు తమ్మినాయుడు, మైనింగ్ ఆర్ఐ రమణ లేట్రైట్ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు వాహనాలు, మట్టి ఉన్నాయి. లేటరైట్ లీజును రద్దు చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులను ప్రభుత్వానికి పంపామని, అక్కడ్నుంచి అదేశాలు వచ్చెంత వరకు తవ్వకాలు చేపట్టరాదని, వాహనాలు సైతం అక్కడే ఉంచాలని ఆదేశించారు. లేట్రైట్ మాఫీయా రుబాబు అండదండలతో శుక్రవారం తవ్వకాలు జరిపినట్లు స్థానికుల సమాచారంతో రెవెన్యూ అధికారులు క్వారీపై దాడి చేశారు. అప్పటికే వాహనాలు మాయమయ్యాయి. దీని గురించి క్వారీలో ఉన్న సూపర్వైజర్ దొరబాబును అధికారులు ఆరా తీశారు. ఆయన నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఆర్ఐ సత్యనారాయణ, సీనియర్ అసిస్టెంటు సోమశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ఆర్టీవో సూర్యారావు వద్ద ప్రస్తావించగా మాఫియా ఆగడాలను జిల్లా కలెక్టర్ దష్టిలో పెట్టామన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. వాహనాలను తరలించుకుపోయినప్పటికీ, వాటి నంబర్లను ముందుగా సేకరించి ఉంచామన్నారు. వాటిని సీజ్ చేస్తామని తెలిపారు. -
విమాన శకలం.. కలకలం!
-
శకలం.. కలకలం!
సాక్షి, విశాఖపట్నం : జిల్లాలోని నాతవరం అటవీ ప్రాంతంలో విమాన శకలం దొరికిందన్న ప్రచారం పెద్ద కలకలం రేపుతోంది. ఈ అడవుల్లో వారం రోజుల క్రితం పెద్ద శబ్దం విన్నామని, అది విమానమై ఉండవచ్చంటూ నాతవరం మండలం దద్దుగుల గ్రామస్తులిచ్చిన సమాచారంతో వైమానిక దళం, అటవీశాఖ అధికారులు శనివారం రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. శనివారం పొద్దుపోయే హెలికాప్టర్లతో వరకు గాలింపు చర్యలు చేపట్టినా అలాంటి ఆనవాళ్లేమీ వారికి దొరకలేదు. ఈ నెల 22న వాయుసేన విమానం ఏఎన్–32 ఎయిర్క్రాఫ్ట్ చెన్నైలోని తాంబరం బేస్ నుంచి పోర్టుబ్లెయిర్ వెళ్తూ అదశ్యమైన నేపథ్యంలో ఈ తాజా ప్రచారానికి ప్రాధాన్యత ఏర్పడింది. అదశ్యమైన ఎయిర్క్రాఫ్ట్ కోసం బంగాళాఖాతం జలాల్లో పలు యుద్ధనౌకలు, వైమానికదళ విమానాలు గాలిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. ఈ తరుణంలో మన జిల్లాలోని నాతవరం పరిసరాల్లోని అడవుల్లో విమాన శకలాన్ని పోలిన వస్తువు దొరికిందన్న ప్రచారం ఆదివారం సాయంత్రం తీవ్రతరమైంది. ఎన్ఏడీ ప్రాంతంలో ఏ నలుగురు కూర్చున్నా దీనిపైనే చర్చించుకుంటున్నారు. ఆ శకలాన్ని దొరికిన ప్రాంతం నుంచి ఎన్ఏడీకి తెచ్చినట్టు చెబుతున్నారు. ఆ శకలం ఏమిటన్నది నిగ్గు తేల్చేందుకు హుటాహుటీన ఢిల్లీ పంపించినట్టు తెలిసింది. దీనిపై ఒకట్రెండు రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అయితే నాతవరం అటవీప్రాంతంలో శకలం దొరికిందన్న ప్రచారాన్ని ఎన్ఏడీ అధికారులు తోసిపుచ్చుతున్నారు. ఇప్పటికే అదశ్యమైన విమానంలో ఉన్న వారి కుటుంబ సభ్యులు దాదాపు పది రోజులుగా కంటిమీద కునుకులేకుండా గడుపుతున్నారు. తమ వారు సజీవంగా ఇంటికొస్తారన్న గంపెడాశతో ఉన్నారు. సంబంధిత ఉన్నతాధికారులు కూడా బాధితుల ఇళ్లకు వచ్చి కుటుంబ సభ్యులను ఓదారుస్తూ ధైర్యం చెబుతున్నారు.