ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఆ ఘటనలో ఎనిమిది మంది మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు.
ప్యారిస్: ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఆ ఘటనలో ఎనిమిది మంది మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను నగరంలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని ఫ్రెంచ్ ఎమర్జన్సీ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఉన్నతాధికారులు వెల్లడించారు.
శిథిలాల కింద చిక్కుకున్న రెండు మృతదేహాలను నిన్న సాయంత్రం వెలికితీసినట్లు చెప్పారు. ఆ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఫ్రెంచ్ హోంశాఖ మంత్రి బెర్నార్డ్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.