మహారాష్ట్ర పుణేలో ఓ ఏడంతస్తుల భవనం కూలింది. శివారు ప్రాంతమైన అమ్బేగాన్ ప్రాంతంలో తెల్లవారుజామున ...
పుణే : మహారాష్ట్ర పుణేలో ఓ ఏడంతస్తుల భవనం కూలింది. శివారు ప్రాంతమైన అమ్బేగాన్ ప్రాంతంలో తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఈ భవనం కుప్పకూలింది. పురాతన భవనంలో ఎనిమిది కుటుంబాలు నివాసం ఉంటున్నాయని పోలీసులు తెలిపారు. శిథిలాల్లో నలుగురు చిక్కుకున్నట్లుగా సమాచారం. వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.