ఖమ్మం(ములకలపల్లి): రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా ములకలపల్లిలో గురువారం వేకువ జామున చోటుచేసుకుంది. మండలంలోని జగన్నాథపురం బస్టాండ్ సెంటర్‌లో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అదే గ్రామానికి చెందిన శేఖర్(45) అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, దమ్మపేట మండలానికి చెందిన మరో వ్యక్తి బానోతు లాలు తీవ్రంగా గాయపడి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.