హైదరాబాద్ క్రైం : ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తికి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో వాహనం పైనుంచి కిందపడి మృతిచెందాడు. ఈ సంఘటన నగరంలోని అల్వాల్ మెయిన్ రోడ్డులో గురువారం ఉదయం చోటుచేసుకుంది. సుభాష్‌నగర్‌కు చెందిన రాజు (35) బైక్‌పై వెళ్తుండగా హార్ట్‌ఎటాక్ రావడంతో బైక్ పై నుంచి కిందపడ్డాడు. గుండెపోటుతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. పూర్తి వివరాలు తెలియరాలేదు.