ఎరువుల కోసం వచ్చిన వ్యక్తి ఇంటికి వెళ్తుండగా ఆటో రూపంలో మృత్యువు కబళించింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.
ఉప్పలపాడు (కామవరపుకోట), న్యూస్‌లైన్ : ఎరువుల కోసం వచ్చిన వ్యక్తి ఇంటికి వెళ్తుండగా ఆటో రూపంలో మృత్యువు కబళించింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం... టి.నరసాపురం మండలం సాయంపాలెంకు చెందిన సూరం దేవరాజు(33), బట్రు నాగరాజు అనే వ్యక్తితో కలిసి సోమవారం రాత్రి మోటార్ సైకిల్‌పై ఎరువుల నిమిత్తం కామవరపుకోట వచ్చాడు. పని ముగించుకుని ఇద్దరూ సాయంపాలెం వెళ్తుండగా ఉప్పలపాడు వద్ద ఎదురుగా వచ్చిన ట్రక్కు ఆటో బలంగా ఢీకొనడంతో దేవరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన నాగరాజును, స్వల్ప గాయాలైన ఆటో డ్రైవర్‌ను 108 వాహనంలో జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతునికి భార్య నాగమణి, కుమార్తె అనూష ఉన్నారు. భార్య ప్రస్తుతం గర్భిణి. ఈ దుర్ఘటనపై తడికలపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.