రోడ్డు ప్రమాదంలో విశాఖ వాసి దుర్మరణం
తణుకు క్రైం, న్యూస్‌లైన్ : రోడ్డు ప్రమాదంలో బస్సు అటెండెంట్ దుర్మరణం చెందిన ఘటన తణుకు జాతీయ రహదారిపై జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం తెల్లవారు జాము న 4.30 గంటల సమయంలో చెనై్న నుంచి వైజాగ్ వెళ్తున్న విశాఖపట్నం డిపోకు చెందిన ఆర్టీసీ ఇంద్ర బస్సు తణుకు జాతీయ రహదారిపై ఉన్న టోల్‌గేట్ వద్ద ముందు ఉన్న వాహనాలకు 50 మీటర్ల దూరంలో ఆగింది. బస్సు అటెండెంట్ గానుగుల గంగాధరరావు(45) బస్సు ఆగిన వెంటనే కాలకృత్యాలు తీర్చుకుని వస్తానని డ్రైవర్‌కు చెప్పి కిందకు దిగాడు.
బస్సుకు ముందు ఉన్న లారీకి మధ్యలోంచి వెళ్తుండగా అదే సమయంలో వెనుక నుంచి సిమెంట్ లోడుతో వేగంగా వచ్చిన లారీ బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు ఉన్న లారీని ఢీకొంది. ఈ క్రమంలో గంగాధరరావు లారీ, బస్సుకు మధ్య నలిగిపోరుు అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనలో బస్సు వెనుక భాగం ధ్వంసమైంది. అదృష్టవశాత్తూ బస్సులో ఉన్న 12 మంది ప్రయూణికులు ఎటువంటి గాయూలు లేకుండా బయటపడ్డారు. సిమెంట్ లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండడం వల్లే ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చే రుకుని శవ పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని తణుకు ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు.
డ్యూటీకి వెళ్లొదన్నా వినలేదు
రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయ్.. ఇక బస్సు ఎక్కొద్దంటే ఈనెల జీతం తీసుకుని మానేస్తానని చెప్పిన భర్త అంతలోనే దూరమైపోయాడని భార్య సరోజిని కన్నీటి పర్యంతమైంది. ఈరోజు డ్యూటీకి వెళ్లొద్దని చెప్పినా తప్పదని వెళ్లాడని.. బస్సు దిగకుండా ఉన్నా తన భర్త దక్కేవాడని ఆమె రోదించిన తీరు చూపరులను కలచి వేసింది. ఎలక్ట్రీషియన్‌గా పనిచేసే గంగాధరరావు విశాఖపట్నంలోని అల్లిపురం ప్రాంతానికి చెందినవాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అతను పనిచేసే కంపెనీలో పని లేకపోవడంతో 4 నెలలుగా విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్లే ఆర్టీసీ ఇంద్ర బస్సులో అటెండెంట్‌గా పనిచేస్తున్నాడు.