కడప(వెఎస్సార్‌జిల్లా): కడప నగరంలో కలకలం రేపిన చిన్న చౌక్ కారులో మృతదేహం వివరాలు బయటపడ్డాయి. మృతదేహం పులివెందులకు చెందిన సతీష్ కుమార్‌దిగా పోలీసులు గుర్తించారు.
పులివెందులకు చెందిన సతీష్ కుమార్(36) స్థానిక పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్నాడు. 5 రోజుల కిందట ఇంటి నుంచి బయటకు వచ్చిన అతను తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో అతని కుటుంబ సభ్యులు పులివెందుల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా శుక్రవారం సాయంత్రం చిన్న చౌక్ ప్రాంతంలో గుర్తుతెలియని మృతదేహం ఉందన్న విషయం తెలుసుకున్న సతీష్ బంధువులు దాన్ని సతీష్‌దిగా ధ్రువీకరించారు. గుర్తుతెలియని దుండగులు వేరే ప్రాంతంలో హత్య చేసి మృతదేహాన్ని కారులో పడేసి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.