ఘట్‌కేసర్(రంగారెడ్డి) : రైలు కిందపడి ఓ వ్యక్తి మృతి బలవన్మరణం చెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసరి రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం వెలుగుచూసింది. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. రైల్వే స్టేషన్ సమీపంలోని ట్రాక్ పై ఓ వ్యక్తి మృతదేహన్ని గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనుమానాస్పద కేసుగా నమోదు చేసి ప్రమాదవశాత్తు మరణించాడా? లేదా ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.