
ఏలూరు అర్బన్/తేలప్రోలు(గన్నవరం): కృష్ణా జిల్లా తేలప్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై బుధవారం మూడు మృతదేహాలను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో ఒక మహిళతో పాటు ఓ యువతి, మరో బాలిక ఉన్నారు. వీరు రైలు నుంచి జారిపడి మరణించారా లేక ఎవరైనా హత్య చేసి శవాలను పట్టాలపై పడేశారా అనే విషయమై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఘటనకు సంబంధించి ఏలూరు రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తేలప్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై గుర్తు తెలియని మూడు మృతదేహాలు పడి ఉన్నాయని బుధవారం ఉదయం ఏలూరు రైల్వే పోలీసులకు సమాచారం అందింది. ఏలూరు రైల్వే సీఐ గంగాధర్ నేతృత్వంలో సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుల చేతిపై ఉన్న పచ్చబొట్లు ఆధారంగా ఒడిశా రాష్ట్రానికి చెందిన వారుగా భావిస్తున్నారు. రైల్లో ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తూ వీరంతా జారిపడి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుల ఆచూకీకి సంబంధించి ఎటువంటి ఆధారాలు లభించలేదని సీఐ గంగాధర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment