సదాశివం ఫైల్‌ఫొటో , కన్నీరు మున్నీరు అవుతున్న తల్లి నూకరత్నం
విశాఖ క్రైం: పనికి వెళ్లి తిరిగి వస్తాడని ఎదురుచూస్తున్న తల్లికి కుమారుడు శవమై కనిపించి పుట్టెడు దుఃఖాన్ని మిగి ల్చాడు. పుట్టిన రోజు నాడే తిరిగి రాని లోకాలకు వెళ్లి పోయిన కొడుకుని చూసి ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. నక్కపల్లి మండలంలో రైలు పట్టాలపై శుక్రవారం అనుమానాస్పదంగా మృతిచెందిన తాపీమేస్త్రి సదాశివం(34)ను కారులో అక్కయ్యపాలేనికి తీసుకురావడం కలకలం రేపింది. పోలీసులు, బంధువులు తెలి పిన వివరాలిలా ఉన్నాయి. అక్కయ్యపాలెం 80 అడుగుల రహదార గవర తాటిచెట్లపాలెంలో మారగలో సదాశివం(34) ఉంటున్నాడు. తాపీమేస్త్రి పని చేస్తుంటాడు. ఇతని భార్య మోహన్‌లత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మద్యానికి బానిస కావడంతో భార్య దూరంగా ఉంటున్నాడు. ఇద్దరు కొడుకులు అనారోగ్యం కారణంగా చిన్నప్పుడే చనిపోయారు. దీంతో అప్పటి నుంచి సదాశివం తల్లి నూకరత్నం వద్ద ఉంటున్నాడు. స్థానికంగా తోటి పనివాళ్లతో కలిసి దూరప్రాంతాలకు పనికి వెళ్తుంటాడు.
ఇదే మాదిరిగా గత బుధవారం నక్కపల్లి నుంచి ఆరు కిలోమీటర్లు దూరంలో ఉన్న బోదిపాలెం ప్రాంతానికి పనికి వెళ్లాడు. అక్కడ పనికి తీసుకువెళ్లిన కాంట్రాక్ట్‌ర్‌ను మద్యానికి డబ్బులు ఇవ్వాలని, లేకుంటే చనిపోతానని బెదిరించాడు. శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో తోటి వారు పని చేస్తుండగా.. ఇక్కడికి కాస్త దూరంలో ఉన్న రైల్వే ట్రాక్ దగ్గరకు వెళ్లాడు. ఇలా రెండు, మూడు సార్లు వెళ్లిరావడాన్ని తోటి పని వారు గమనిస్తున్నారు. అటుగా రైలు వస్తున్న సమయంలో తల ముందు పెట్టడంతో ఢీకొని వెళ్లిపోయింది. దీంతో అక్కడక్కడే మృతి చెందాడు. విషయం పోలీసులకు తెలిస్తే కేసు అవుతుందని భయపడి తోటి పనివారు ఇంటికి తరలించాలనే కంగారులో మృతదేహన్ని సంచిలో కట్టి అక్కడ నుంచి అద్దె కారులో నగరానికి ఇంటికి తీసుకువచ్చారు.
కారులో మృతదేహాన్ని దించడాన్ని స్థానికులు గమనించారు. మృతదేహాన్ని ఆయన తల్లికి అప్పగించ్చేందుకు ప్రయత్నించడంతో స్థానికులు ఏమైందని ఆరా తీసి తీసుకోవడానికి నిరాకరించారు. వెంటనే నాలుగో పట్టణ పోలీసులకు సమాచారం అందించడంతో సిబ్బం ది అక్కడికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. మృతదేహాన్ని తీసుకు వచ్చిన నలుగుర్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నక్కపల్లి పోలీసులకు కూడా సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలాన్ని పరిశీలించి పట్టా లపై రక్తపు మరకలు ఉన్నట్లు గుర్తించి ఇక్కడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై ఎస్‌ఐ సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment