దుర్గామాత నిమజ్జనంలో అపశ్రుతి | Accident in Immersion of Durga | Sakshi
Sakshi News home page

దుర్గామాత నిమజ్జనంలో అపశ్రుతి

Published Sat, Oct 24 2015 8:13 AM | Last Updated on Sat, Sep 29 2018 5:55 PM

Accident in Immersion of Durga

దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు తీసుకెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఒక వ్యక్తి విద్యుత్ షాక్‌తో చనిపోయాడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వెలిమినేడు గ్రామంలో శుక్రవారం అర్థరాత్రి ఈ అపశ్రుతి చోటుచేసుకుంది. దసరా సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించేందుకు ట్రాక్టర్‌ను సిద్ధం చేశారు. వెలుతురు కోసం అందులో ఉంచిన జనరేటర్‌కు ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రసారమైంది. ఈ విషయం తెలియని ఐతారం పెంటయ్య(30) అనే వ్యక్తి జనరేటర్‌ను తాకటంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే చనిపోయాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement