నల్లగొండ(క్రైం): నల్లగొండ జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తిని శనివారం కారు ఢీకొట్టింది. అనంతరం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. అయితే మృతుడి బంధువులు ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ ఇంటి ఎదుట మృతదేహంతో పట్టణంలోని శాంతి నగర్‌లో ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించేవరకు కదిలేది లేదని కారు డ్రైవర్ ఇంటి ఎదుట బైఠాయించారు.