relatives strike
-
డ్రైవర్ ఇంటి ఎదుట మృతదేహంతో ధర్నా
నల్లగొండ(క్రైం): నల్లగొండ జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తిని శనివారం కారు ఢీకొట్టింది. అనంతరం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. అయితే మృతుడి బంధువులు ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ ఇంటి ఎదుట మృతదేహంతో పట్టణంలోని శాంతి నగర్లో ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించేవరకు కదిలేది లేదని కారు డ్రైవర్ ఇంటి ఎదుట బైఠాయించారు. -
వ్యక్తి మృతి.. బంధువుల ఆందోళన
అనంతపురం : తమ కుటుంబ సభ్యుడి మృతికి వైద్యులే కారణమంటూ బంధువులు ఆస్పత్రి ఎదుటు ఆందోళనకు దిగారు. ఈ ఘటన అనంతపురం జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. జిల్లాలోని కళ్యాణదుర్గం మండలం వర్ని గ్రామానికి చెందిన ధనంజయకు కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు అనంతపురంలోని ఎస్పీ ఆస్పత్రిలో చేర్చారు. అయితే వైద్యులు శస్త్ర చికిత్స చేసి ఈ రోజు డిశ్చార్జి చేశారు. అయితే ధనంజయను కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలోనే అతను మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యంతోనే ధనంజయ మృతి చెందాడని ఆస్పత్రి ఎదుట బంధువులు ధర్నాకు దిగారు. -
టిప్పర్ ఢీకొని ఇద్దరి దుర్మరణం
వర్ని: టిప్పర్ డీకొని ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా వర్ని మండలం రుద్రూరు - అక్బర్ నగర్ల మధ్య మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. తమకు న్యాయం చేయాలంటూ మృతుల బంధువులు మృతదేహాలతో సంఘటన స్థలంలో ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి : బంధువుల ఆందోళన
గోదావరిఖని : ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మరణించడంతో అతని బంధువులు ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గోదావరిఖనికి చెందిన ఆరెళ్లి రమేష్(40) అనే వ్యక్తి సోమవారం కడుపునొప్పితో ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. అతన్ని పరీక్షించిన వైద్యులు అపెండిక్స్ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ అనంతరం ఆస్పత్రిలో ఉన్న రమేష్ ఈ రోజు ఉదయం మృతిచెందాడు. దీంతో వైద్యుల నిర్లక్ష్యం వల్లే రమేష్ చనిపోయాడని ఆరోపిస్తూ అతని బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. -
పీఎస్ లో నిందితుడి అనుమానాస్పద మృతి
మిర్యాలగూడ : నల్లగొండ జిల్లా మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో విచారణలో ఉన్న అంతర్ రాష్ట్ర దొంగ అనుమానస్పద స్థితిలో మృతి చెందడం సంచలనానికి దారి తీసింది. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం సుబ్బారావుపేట గ్రామానికి చెందిన మార్నిడి చక్రధర్‌రావుకు పలు చోరీ కేసుల్లో పాత్ర ఉందంటూ వన్‌టౌన్ పోలీసులు ఈ నెల 22న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శనివారం ఉదయం కస్టడిలోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే, అర్ధరాత్రి సమయంలో చక్రధర్‌రావు సొమ్మసిల్లి పడిపోగా పోలీసులు హుటాహుటిన స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అతడు గుండెపోటుతో మృతి చెందినట్టు వైద్యులు తెలుపగా... విచారణలో భాగంగా పోలీసులు నిందితుడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఉంటారని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. -
పోలీస్ స్టేషన్ ఎదుట మృతుడి బంధువుల ఆందోళన
కోట : పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా మృతి చెందడంపై నెల్లూరు జిల్లా కోట మండలం గూడలి గ్రామస్తులు ఆదివారం ఆందోళనకు దిగారు. వివరాలు... గూడలి గ్రామానికి చెందిన గంటా జనార్దన్(40)ను బస్ డ్రైవర్‌పై దాడి చేసిన ఘటనలో పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. అయితే, జనార్దన్ పోలీస్ స్టేషన్లోనే మృతి చెందాడు. పోలీసులు చిత్రహింసలు పెట్టడం వల్లే అతడు మరణించాడని బంధువులు, గ్రామస్తులు ఆదివారం ఉదయం కోట పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. డీఎస్పీ వచ్చి తమకు సమాధానం చెప్పాలంటూ రోడ్డుపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు.