వర్ని: టిప్పర్ డీకొని ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా వర్ని మండలం రుద్రూరు - అక్బర్ నగర్ల మధ్య మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. తమకు న్యాయం చేయాలంటూ మృతుల బంధువులు మృతదేహాలతో సంఘటన స్థలంలో ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.