ఆంధ్ర ప్రదేశ్ లో గురువారం కురిసిన భారీ వర్షంలో పిడుగు పాటుకు గురై ముగ్గురు మరణించారు. వివరాల్లోకి వెళితే.. విశాఖపట్ణం జిల్లాసీలేరు ప్రాంతంలోని బచ్చుపల్లి గ్రామానికి చెందిన కన్నయ్య(45) పొలంలో పనిచేసుకుంటుండగా.. అతనిపై పిడుగు పడింది. కన్నయ్య అక్కడి క్కడే మరణించాడు.
ఇంకో ఘటనలో శ్రీకాకుళం జిల్లా బామిని సమీపంలో ఆరికి ఇలియాస్ (16) అనే ఇంటర్ విద్యార్థి మరణించాడు. కాలేజీ నుంచి ఇంటికి వస్తున్న సమయంలో భారీ వర్షం కురవటంతో అతను చెట్టు కిందకు పరిగెత్తాడు. అదే సమయంలో చెట్టుపై పిడుగు పడి.. ఇలియాస్ అక్కడికక్కడే మృతి చెందాడు.
మరో ఘటనలో గుంటూరు జిల్లా అమరావతిలో పల్లెకొండ అనే పశువుల కాపరి మరణించాడు. కృష్ణానది ఒడ్డున పశువులు కాస్తుండగా.. ఆయనపై పిడుగు పడింది. ఇక గుంటూరు జిల్లా రామాంజనేయ పురంలో పిడుగుపాటుకు 40 మేకలు మృతి చెందాయి. ఇదే ఘటనలో అక్కయ్య(38) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
పిడుగు, వ్యక్తి మృతి, విశాఖపట్టణం, గుంటూరు, అమరావతి, పశువులు, సీలేరు, భారీ వర్షం, విద్యార్ధి, శ్రీకాకుళంThunder, person died, Visakhapatnam , sileru, heavy rain , Guntur , Amaravati , cattle, Student , Srikakulam
పిడుగు పాటుకు ముగ్గురి మృతి
Published Thu, Oct 1 2015 4:45 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
Advertisement
Advertisement