sileru
-
సీలేరులో మరో వెలుగు
సీలేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): తూర్పు కనుమల్లో ఆంధ్ర ఒడిశా సరిహద్దు దట్టమైన అటవీ ప్రాంతంలో ఒక్కొక్క నీటి బిందువు ప్రవాహంలా మారి ప్రవహిస్తూ పేరు గాంచిన సీలేరు నది రాష్ట్రానికి గుర్తింపు తెచ్చింది.ఈ ప్రాంతంలో సహజ సిద్ధంగా ప్రవహించే నీటితో తక్కువ ఖర్చుతో రూ.కోట్లలో ఆదాయం ఇచ్చేలా మరో జల విద్యుత్ కేంద్రం నిర్మాణానికి శ్రీకారం కానుంది. ఏపీ జెన్కో ఆధ్వర్యంలో సీలేరు విద్యుత్ కాంప్లెక్స్‌లో ఉన్న జలవిద్యుత్ కేంద్రాలతో పాటు నూతనంగా పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు (ఎత్తిపోతల పథకం) నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మరో నెలరోజుల్లో పనులూ ప్రారంభం కానున్నాయని అధికారులు వెల్లడించారు.ప్రాజెక్టు నిర్మాణం ఇలాతూర్పుకనుమల్లో మాచ్‌ఖండ్ మొదలుకొని బలిమెల నుంచి సీలేరు, డొంకరాయి, మోతుగూడెం జలవిద్యుత్ కేంద్రాల్లోఉత్పత్తి అయిన నీరు శబరి నదిలో కలిసి గోదావరి మీదుగా సముద్రంలో కలుస్తుంది. ఈ నీటిని వృధా కాకుండా పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు ద్వారా మరింత విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చనే లక్ష్యంతో ఏపీ జెన్కో రూ.13 వేల కోట్లతో సీలేరు సమీప పార్వతీనగర్ వద్ద తొమ్మిది యూనిట్లు ( 1350 మెగావాట్లు) విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం పైభాగంలో 3 కిలోమీటర్ల పొడవునా. సొరంగం తవ్వి గుంటవాడ డ్యామ్ నుంచి నీటిని తీసుకువచ్చి విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు.అనంతరం విడుదలైన నీరు మరో 3 కిలోమీటర్ల పొడవైన సొరంగం ద్వారా డొంకరాయి జళాశయంలోకి మళ్లిస్తారు. అవసరమైనప్పుడు ఆదే నీటిని రివర్స్ పంపింగ్ విధానంతో ఆదే సొరంగం ద్వారా గుంటవాడ డ్యాంలోకి మళ్లించి మూడు సొరంగాల ద్వారా తొమ్మిది పైపులైన్లతో ఏర్పాటు చేయనున్నారు. అవసరమైనప్పుడు ఈ నీటిని విద్యుత్ ఉత్పత్తి చేసే వి«ధంగా యాప్‌కో సంస్థ ద్వారా మూడేళ్లు సుదీర్ఘంగా పరిశీలన చేసింది. -
‘సీలేరు’కు సర్వం సిద్ధం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భవిష్యత్ విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందుచూపుతో చేపట్టిన పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టు (పీఎస్పీ)ల ఏర్పాటుకు అడ్డంకులు తొలగుతున్నాయి. విశాఖపట్నం జిల్లాలోని ఎగువ సీలేరు పార్వతీనగర్ వద్ద 1,350 మెగావాట్ల సామర్థ్యం గల భూగర్భ పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టుకు అనుమతుల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఆర్థిక, పర్యావరణ అనుమతులు వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టుకు టెండర్ల ప్రక్రియను చేపట్టనున్నట్లు ఏపీ జెన్కో వెల్లడించింది. ఇందులో భాగంగా పర్యావరణ అనుమతులకు అవసరమైన నివేదికను సిద్ధం చేసింది. అధికారులు, ఇంజనీర్లు, సిబ్బంది నివాసానికి అవసరమైన నివాసాలు, కార్యాలయాలు, షెడ్లను సిద్ధం చేస్తోంది. ఎగువ సీలేరు వద్ద ఉన్న గుంటవాడ రిజ ర్వాయర్ (ఎగువ) నుంచి 1.70 టీఎంసీల నీటిని వినియోగించడం ద్వారా పీక్ అవర్స్‌లో 1,350 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. అలాగే డొంకరాయి రిజర్వాయర్ (దిగువ) నుంచి 1.70 టీఎంసీల నీటిని గుంటవాడ రిజర్వాయర్‌కు ఆఫ్ పీక్ వేళల్లో పంపు చేయడం కూడా ఈ ప్రాజెక్ట్ ప్రాధాన్యతల్లో ఒకటి. ఆకస్మిక హెచ్చుతగ్గుల కారణంగా గ్రిడ్‌పై భారం పడి.. సమస్యలు తలెత్తకుండా స్థిరంగా ఉంచేందు కు ప్రాజెక్ట్ సహాయపడుతుంది. ఇందుకు గ్రిడ్‌లో ఉన్న మిగులు విద్యుత్‌ను ఉపయోగిస్తారు. 29 ప్రాంతాల్లో ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం.. రాష్ట్రంలో 29 ప్రాంతాల్లో 33,240 మెగావాట్ల సామర్థ్యంతో పీఎస్పీలను నెలకొల్పడానికి ప్రణాళిక సిద్ధమైంది. మరో 10 వేల మినీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఇటీవల గుర్తించింది. మొత్తంగా 43,240 మెగావాట్ల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. వీటి కోసం వైఎస్సార్, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని 1.45 లక్షల ఎకరాల భూమికి టెక్నో కమర్షియల్ ఫీజిబిలిటీ స్టడీస్ నిర్వహించింది. పెట్టుబడులు పెట్టేవారికి, పరికరాల తయారీ సౌకర్యాల ప్రాజెక్ట్ డెవలపర్లకు సుమారు 5 లక్షల ఎకరాలను లీజుకు ఇవ్వడానికి భూమిని సమకూరుస్తోంది. తొలి దశలో వైఎస్సార్ జిల్లా గండికోట, అనంతపురం జిల్లా చిత్రావతి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సోమశిల, కర్నూలు జిల్లా అవుకు రిజర్వాయర్, విజయనగరం జిల్లా కురుకూటి, కర్రివలస, విశాఖపట్నం జిల్లా ఎర్రవరంలలో 6,600 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల ఏడు పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది. పీఎస్పీల వల్ల రాష్ట్రానికి గ్రీన్ ఎనర్జీ డెవలప్మెంట్ ఛార్జీల కింద రూ.8,058 కోట్లు అందుతాయి. పన్ను రాబడి కింద రూ.1,956 కోట్ల మొత్తం సమకూరుతుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 58,600 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. త్వరలోనే టెండర్లు.. సీలేరులో 1,350 మెగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయడానికి దాదాపు 410 హెక్టార్ల భూమి అవసరమవుతోంది. టోపోగ్రాఫికల్, హైడ్రోగ్రాఫిక్ సర్వేలు, జియోటెక్నికల్ పరిశోధనలు ఇప్పటికే పూర్తయ్యాయి. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) కూడా సిద్ధంగా ఉంది. ఆర్థిక, పర్యావరణ అనుమతులు రాగానే టెండర్ డాక్యుమెంట్లను న్యాయ సమీక్షకు పంపిస్తాం. అక్కడి నుంచి క్లియరెన్స్ తీసుకుని టెండర్లు పిలిచి.. త్వరలోనే పనులు మొదలుపెడతాం. –బి.శ్రీధర్, ఎండీ, ఏపీ జెన్కో -
Photo Feature: మన్యం అందం.. ద్విగుణీకృతం
కవుల వర్ణనలో కనిపించే అందాలెన్నో మన్యంలో కనువిందు చేస్తున్నాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల్లో జలపాతాలు పొంగిపొర్లుతూ.. కొత్త సోయగాలు సంతరించుకుంటున్నాయి. ఆకాశం నుంచి నేలకు తాకుతున్న మబ్బులతో కొత్తందాలు ఆవిష్కృతమవుతున్నాయి. ప్రకృతి పచ్చని తివాచీ పరిచిందా అన్నట్లు అబ్బురపరిచే పొలాలు పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సీలేరు జలాశయం వ్యూ పాయింట్, గుంటవాడ డ్యాం, సీలేరు సమీపంలోని తురాయి జలపాతం, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, గుర్రాయి, ఎగ కంఠవరంలోని అక్కాచెల్లెల జలపాతాలు, కుంబిడిసింగి మార్గంలో జలపాతం అందాలు పర్యాటకులను ఆహ్లాదపరుస్తున్నాయి. అరమ, సొవ్వ, సాగర, కొర్రా తదితర ప్రాంతాలు పచ్చదనంతో ముచ్చటగొల్పుతున్నాయి. కొండ ప్రాంత అందాలకు ప్రకృతి ప్రేమికులు పరవశించిపోతున్నారు. – సీలేరు, జి.మాడుగుల, డుంబ్రిగుడ (అల్లూరి సీతారామరాజు జిల్లా) -
సీలేరులో మరో విద్యుత్ ప్రాజెక్ట్
సాక్షి, అమరావతి: విద్యుత్ ఉత్పత్తి రంగంలో మరో మైలురాయిని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా ఎదురైన బొగ్గు సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రాష్ట్రంలో జల విద్యుత్ ఉత్పత్తి పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యుత్ శాఖ సమీక్షలో ఇటీవల ఆదేశించారు. 6,300 మెగావాట్ల సామర్థ్యంతో రివర్స్ పంపింగ్ విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా సీలేరులో 1,350 మెగావాట్ల రివర్స్ పంపింగ్ ప్రాజెక్టుపై తక్షణమే దృష్టి సారించాలని ఆదేశాలిచ్చారు. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లాలోని ఎగువ సీలేరు వద్ద పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్ట్ పనులు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. సీలేరులో రివర్సబుల్ పంపులను వ్యవస్థాపించడంపై ప్రధానంగా దృష్టి సారించాలని ఏపీ జెన్కోను ప్రభుత్వం ఆదేశించింది. గ్రిడ్ స్థిరీకరణ, సౌర, పవన విద్యుత్‌తో అనుసంధానం చేయడం, వినియోగదారులకు నిరంతరం విద్యుత్ అందించడం, భవిష్యత్‌లో ఇంధన డిమాండ్‌ను తీర్చడానికి చర్యలు తీసుకోవాలని సూచించింది. గ్రిడ్‌పై భారం తగ్గుతుంది ఎగువ సీలేరు వద్ద ఉన్న గుంటవాడ రిజర్వాయర్ (ఎగువ) నుంచి 1.70 టీఎంసీల నీటిని వినియోగించడం ద్వారా పీక్ అవర్స్‌లో 1,350 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం, డొంకరాయి రిజర్వాయర్ (దిగువ) నుంచి 1.70 టీఎంసీల నీటిని గుంటవాడ రిజర్వాయర్‌కు ఆఫ్ పీక్ వేళల్లో పంప్ చేయడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యమని ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ తెలిపారు. గ్రిడ్‌లో అందుబాటులో ఉన్న మిగులు విద్యుత్‌ను ఉపయోగించడం ద్వారా ఆకస్మిక హెచ్చుతగ్గుల కారణంగా గ్రిడ్‌పై భారం పడి సమస్యలు తలెత్తకుండా స్థిరంగా ఉంచేందుకు ఈ ప్రాజెక్ట్ సహాయపడుతుందని ఆయన వివరించారు. శ్రీశైలం, పోలవరం తర్వాత ఇదే పెద్దది 1,350 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్ట్‌ను స్థాపించడానికి దాదాపు 410 హెక్టార్ల భూమి అవసరమవుతుందని ఏపీజెన్కో మేనేజింగ్ డైరెక్టర్ బి.శ్రీధర్ పేర్కొన్నారు. టోపోగ్రాఫికల్ సర్వే, హైడ్రోగ్రాఫిక్ సర్వే, 76.9 శాతం జియోటెక్నికల్ పరిశోధనలు పూర్తయ్యాయని తెలిపారు. శ్రీశైలం, పోలవరం హైడ్రో ప్రాజెక్టుల తర్వాత ప్రతిష్టాత్మక ఎగువ సీలేరు ప్రాజెక్ట్ రాష్ట్రంలోనే అతి పెద్దదిగా పరిగణిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ స్థాపనకు అన్ని అనుమతులను పొందడంతోపాటు డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) తయారుచేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం వాప్కాస్ లిమిటెడ్‌కు అప్పగించిందన్నారు. -
జూన్ 5 వరకు సీలేరులో విద్యుదుత్పత్తి బంద్
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల నేపథ్యంలో సీలేరులో జూన్ 5వ తేదీ వరకు జలవిద్యుదుత్పత్తిని నిలిపి వేయాలని జలవనరుల శాఖ చేసిన ప్రతిపాదనను ఏజీ జెన్కో (ఆంధ్రప్రదేశ్ విద్యుదుత్పత్తి సంస్థ) ఆమోదించింది. గోదావరి ప్రవాహాన్ని జూన్ రెండో వారంలో పోలవరం స్పిల్ వే మీదుగా మళ్లించే ప్రక్రియ ప్రారంభమయ్యాక.. సీలేరులో మళ్లీ విద్యుదుత్పత్తిని ప్రారంభించనున్నారు. గతంలో గోదావరి ప్రవాహం దిగువకు వెళ్లేందుకు వీలుగా ఎగువ కాఫర్ డ్యామ్‌లో 300 మీటర్ల ఖాళీ ప్రదేశాన్ని వదిలారు. ఇప్పుడు ఆ ఖాళీ ప్రదేశాన్ని భర్తీ చేసే పనుల ప్రక్రియను వేగవంతం చేశారు. గోదావరిలో సహజ సిద్ధ ప్రవాహం రెండు వేల క్యూసెక్కులు వస్తుండడంతో.. ఆ ప్రవాహాన్ని నిలుపుదల చేసేలా రింగ్ బండ్ వేసి ఎగువ కాఫర్ డ్యామ్ ఎత్తును సగటున 38 మీటర్ల ఎత్తుకు పెంచే పనులను వేగవంతం చేశారు. గోదావరి వరద ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించేందుకు నది నుంచి.. కుడి వైపునకు 2.18 కిమీల పొడవున అప్రోచ్ ఛానల్ తవ్వే పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆ పనులు పూర్తయ్యాక.. స్పిల్ వే మీదుగా ప్రవాహాన్ని మళ్లిస్తారు. అనంతరం కాఫర్ డ్యామ్‌ను 42.5 మీటర్ల ఎత్తుకు పెంచే పనులను జూలై నాటికి పూర్తి చేసి.. వరద సమయంలోనూ ప్రధాన డ్యామ్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్) పనులు చేపట్టి 2022 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. -
సీలేరులో నాటు పడవల బోల్తా
సీలేరు: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు సీలేరులో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఇక్కడి జలాశయంలో రెండు నాటు పడవలు బోల్తా పడిన ఘటనలో 8మంది గిరిజన కూలీలు గల్లంతయ్యారు. వారిలో 6 మృతదేహాలు లభ్యం కాగా.. ఇద్దరి జాడ ఇంకా తెలియరాలేదు. వీరిలో ఎక్కువ మంది చిన్న పిల్లలే. ప్రమాదం నుంచి 10 మంది సురక్షితంగా బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ బ్లాక్ గుంటవాడ పంచాయతీ పరిధిలోని కొందుగుడ గ్రామానికి చెందిన చిన్నాపెద్దా కలిసి 35 మంది గిరిజనులు 8 నెలల క్రితం కూలి పనుల నిమిత్తం హైదరాబాద్ వెళ్లారు. ఆదివారం సాయంత్రం వారంతా ఒకే వాహనంలో బయలుదేరి సోమవారం సాయంత్రానికి సీలేరు చేరుకున్నారు. కరోనా నేపథ్యంలో తాము హైదరాబాద్ నుంచి వచ్చిన విషయం అధికారులకు తెలిస్తే క్వారంటైన్‌కు తరలిస్తారని భావించి వారందరూ అడవి మార్గంలో సీలేరు జలాశయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి జలాశయానికి అవతల ఉన్న తమ గ్రామంలోని వారికి సమాచారం అందించి సోమవారం రాత్రి 7 గంటల సమయంలో రెండు నాటు పడవలు తెప్పించుకుని తొలుత 17 మంది అవతలి ఒడ్డుకు చేరుకున్నారు. తిరిగి అవే పడవల్లో రెండో ట్రిప్‌లో 18 మంది బయలుదేరగా.. 30 మీటర్ల వెడల్పు, 70 మీటర్ల లోతున్న జలాశయం మధ్యలోకి వచ్చేసరికి నీటి ప్రవాహం పెరిగి పడవలోకి ఒక్కసారిగా నీరు చేరింది. ముందున్న పడవ మునిగిపోతుండటంతో అందులోని వారు ప్రాణభయంతో వెనక ఉన్న పడవను పట్టుకునే ప్రయత్నం చేయగా.. రెండు పడవలు మునిగిపోయాయి. ముందున్న పడవలో ప్రయాణిస్తున్న 11 మందిలో ఐదుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగా.. ఆరుగురు గల్లంతయ్యారు. వెనుక పడవలోని ఏడుగురిలో ఐదుగురు సురక్షితంగా బయటపడగా ఇద్దరు గల్లంతయ్యారు. 6 మృతదేహాలు వెలికితీత ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ఇంజన్ బోట్ల ద్వారా ప్రమాదం జరిగిన ప్రదేశంలో గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం సాయంత్రానికి అనుష్క (23), ఏసుశ్రీ (5), గాయత్రి (3), అజిర్ (1), సంసోన్ (10), అనుష్ వర్ధన్ (5) మృతదేహాలను వెలికితీయగా.. కొర్రా లక్ష్మి (23), పింకీ (5) జాడ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనపై ఏపీ ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆరా తీసి సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మితో ఆళ్ల నాని ఫోన్లో మాట్లాడారు. విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్, పాడేరు ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్, ఎస్పీ, ఏఎస్పీలు ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటూ సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఒడిశా పోలీస్ శాఖ ఓఎస్డీ సుమరాం, మల్కన్‌గిరి కలెక్టర్ వై.విజయ్‌కుమార్, ఎస్పీ రిషికేస్ కిలారి, ఫైర్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మృతదేహాలను చిత్రకొండ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి కొందుగుడ గ్రామంలో కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
జెన్కో ఇంజనీర్ అనుమానాస్పద మృతి
సాక్షి, రాజమండ్రి: జెన్కో ఇంజనీర్ శ్రీనివాస్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన బుధవారం స్థానికంగా కలకలం రేపింది. సీలేరులో ఒంటరిగా హోం క్వారంటైన్లో ఉన్న శ్రీనివాస్ అకస్మాత్తుగా తన ఇంట్లో శవమై కనిపించడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. కాగా గత మూడు రోజులుగా ఫోన్ చేస్తుంటే తన కాల్స్‌కు సమాధానం ఇవ్వకపోవడంతో మృతుడి భార్య పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పోస్టుమార్టం రిపోర్ట్స్ రావాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. -
పొల్లూరు జలవిద్యుత్‌కు విఘాతం
సాక్షి, మోతుగూడెం (రంపచోడవరం): లోయర్ సీలేరు పొల్లూరు జలవిద్యుత్ కేంద్రంలో నాలుగో యూనిట్ (115 మెగావాట్లు) సాంకేతిక లోపంతో గురువారం నుంచి విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. బోటమ్ లేబరెంట్ సీల్ ఊడిపోవడం వల్ల సరఫరా నిలిచిపోయిందని డీఈ (ఓఈఎం) సత్యనారాయణ తెలిపారు. ఈ గేట్ సీల్ ఊడిపోవడం వల్ల వికెట్ గేట్ వద్ద రాళ్లు, చెక్కలు అడ్డుపడి ఉండవచ్చునని ఆయన తెలిపారు. దీనివల్ల నీరు యూనిట్లలోకి వచ్చి మునిగిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. ఇటీవలే వికెట్ గేట్ సీల్ ఊడిపోయి సుమారు ఐదు రోజులు 4వ యూనిట్ నిలిచిపోయింది. దీంతో హుటహుటిన కాంట్రాక్టర్‌ను పిలిచి యుద్ధ ప్రాతిపదికన పనులు చేయించారు. మళ్లీ బోటమ్ లేబరెంట్ ఊడిపోవడం వల్ల మళ్లీ నాలుగో యూనిట్ సుమారు 25 రోజులపైనే 115 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోనున్నది. దీంతో అభిరామ్ ఇంజినీరింగ్ కంపెనీకి పనులు అప్పగిస్తున్నట్లు డీఈ తెలిపారు. తరచూ మొరాయిస్తున్న యూనిట్లు పొల్లూరు జలవిద్యుత్ కేంద్రానికి సంబంధించి తరచూ 3, 4 యూనిట్లు మొరాయిస్తున్నా జెన్కో యాజమాన్యం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జలవిద్యుత్ కేంద్రం నిర్మించి సుమారు 45 ఏళ్లు అవుతున్నా యంత్ర సామగ్రి మార్చకపోవడంతో ఈ సమస్యలు తలెత్తుతున్నాయని కార్మికులు వాపోతున్నారు. ఇక్కడ యూనిట్లకు ఏమైనా సాంకేతిక లోపం తలెత్తితే తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారు తప్ప శాశ్వత పనులు చేపట్టడం లేదు. ఏటా రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా పరిస్థితిలో మార్పు ఉండడం లేదు. రాష్ట్రంలో అత్యంత కీలకమైన జలవిద్యుత్ కేంద్రాన్ని ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా సాంకేతిక సమస్య తలెత్తితే 25 ఏళ్ల నుంచీ ఒకే సంస్థకు పనులు అప్పగిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
'ఏపీజెన్కో అధికారులు వేధిస్తున్నారు'
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల అధికారుల మధ్య మరో వివాదం తలెత్తింది. సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో పనిచేస్తున్న 21 మంది తెలంగాణ ఇంజినీర్లు తమను ఏపీ జెన్కో అధికారులు వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమపై జెన్కో అధికారులు పరిమితికి మించిన పనిభారం మోపుతున్నారని పేర్కొటూ.. మూడు రోజులుగా తెలంగాణ ఇంజనీర్లు విధులకు హాజరవడం మానేశారు. -
సీలేరు రెండో యూనిట్‌కు మరమ్మతులు
సీలేరు: సీలేరు జల విద్యుత్కేంద్రంలోని రెండో నంబర్ యూనిట్ మరమ్మతులకు గురైంది. విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. యూనిట్ అప్పర్ గ్రైడింగ్ బేరింగ్‌లో ఉష్ణోగ్రతల్లో హెచ్చు తగ్గులను గమనించారు. దీనిని ఇంజినీరింగ్ బందం జెన్కో ఉన్నతాధికారులకు తెలిపింది. ఎకాయెకిన ఎల్టీకీ అనుమతులు జారీ చేశారు. దీంతో స్థానిక గుత్తేదారులతో బుధవారం నుంచి యూనిట్ పనులు చేపడుతున్నారు. యూనిట్‌ను బాగు చేస్తున్నట్టు జెన్కో డివిజనల్ ఇంజినీర్ సుధాకర్ తెలిపారు. ఈ పనులు పది రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు. -
తేనెటీగల దాడిలో భర్త మృతి: భార్యకు గాయాలు
సీలేరు (విశాఖ జిల్లా) : తేనెటీగల దాడిలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన విశాఖ జిల్లా సీలేరు మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. దుప్పలవాడ గ్రామం గొందివీధికి చెందిన భార్యాభర్తలు కొర్ర ధను(50), కొర్ర కుంద్రి(46)లపై తేనెటీగలు దాడిచేశాయి. దీంతో తీవ్రగాయాలపాలైన భర్త ధను కాసేపటికే మృతిచెందాడు. భార్య కుంద్రిని చికిత్స నిమిత్తం వెంటనే స్థానికులు దారకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
'జీవో 97 ఉపసంహరణ చంద్రబాబు కుట్ర'
సీలేరు (విశాఖ) : విశాఖ మన్యంలోని ఆదివాసీ గిరిజనుల ఆగ్రహంపై నీళ్లు చల్లేందుకే జీవో97ను ఉపసంహరించుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు నాటకం ఆడుతున్నారని మావోయిస్టులు ఆరోపించారు. ఆంధ్రా-ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి చంద్రమౌళి పేరుతో శుక్రవారం మీడియాకు ఒక లేఖ అందింది. పోలీసులను ఆదివాసీలపై ఉసిగొల్పేందుకే ముఖ్యమంత్రి ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. స్పెషల్ ప్యాకేజీల పేరుతో ఆదివాసీలను చీల్చి, ఒక వర్గం వారిని తమ వైపు లాక్కునేందుకు కుట్ర పన్నుతున్నారని ఆ లేఖలో తెలిపారు. -
రోడ్డుప్రమాదంలో పసికందుకు తీవ్రగాయాలు
సీలేరు (విశాఖ) : మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి బైక్ నడుపుతూ దారిన నడిచి వెళ్తున్న తల్లీకూతుళ్లను ఢీకొట్టాడు. ఈ ఘటన విశాఖ జిల్లా సీలేరు మండలం దారకొండలో మంగళవారం చోటుచేసుకుంది. గుమ్మురేవుల పంచాయతీ నవగం గ్రామానికి చెందిన మండి సావిత్రి(20) తన ఇరవై రోజుల పసికందుతో మంగళవారం మధ్యాహ్నం దారకొండ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లింది. వైద్య పరీక్షల అనంతరం శిశువును ఎత్తుకుని నడిచి వెళ్తున్న ఆమెను వెనుక నుంచి వచ్చిన బైక్ గుద్దేసింది. దీంతో బాలింత సహా శిశువుకు గాయాలయ్యాయి. చుట్టుపక్కలవారు అప్రమత్తమై బైక్‌పై ఉన్న ఇద్దరిలో ఒకరిని అదుపులోకి తీసుకోగా మరొకరు పరారయ్యాడు. పట్టుబడిన వ్యక్తి ఒడిశాకు చెందినవాడని తేలింది. అతడు మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. పసికందు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
నలుగురు మావోయిస్టులు అరెస్ట్
సీలేరు (విశాఖ జిల్లా) : విశాఖపట్నం జిల్లా అన్నవర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నలుగురు మావోయిస్టులను ఒడిశా సరిహద్దు భద్రతా దళాలు ఆదివారం ఉదయం అరెస్ట్ చేశాయి. పల్లంకిరేవులో బోటు దాటుతుండగా ముగ్గురు చిత్రకొండ బీఎస్ఎఫ్ జవాన్లను వీరు హతమార్చినట్లు నిర్ధారించిన ఒడిశా పోలీసులు బొర్రా శ్రీరాములు, దర్శి బొంచిబాబు, బోండా ప్రసాద్, నాగేశ్వరరావు అనే నలుగురు మావోయిస్టులను ఆదివారం ఉదయం అరెస్ట్ చేశారు. -
పిడుగు పాటుకు ముగ్గురి మృతి
ఆంధ్ర ప్రదేశ్ లో గురువారం కురిసిన భారీ వర్షంలో పిడుగు పాటుకు గురై ముగ్గురు మరణించారు. వివరాల్లోకి వెళితే.. విశాఖపట్ణం జిల్లాసీలేరు ప్రాంతంలోని బచ్చుపల్లి గ్రామానికి చెందిన కన్నయ్య(45) పొలంలో పనిచేసుకుంటుండగా.. అతనిపై పిడుగు పడింది. కన్నయ్య అక్కడి క్కడే మరణించాడు. ఇంకో ఘటనలో శ్రీకాకుళం జిల్లా బామిని సమీపంలో ఆరికి ఇలియాస్ (16) అనే ఇంటర్ విద్యార్థి మరణించాడు. కాలేజీ నుంచి ఇంటికి వస్తున్న సమయంలో భారీ వర్షం కురవటంతో అతను చెట్టు కిందకు పరిగెత్తాడు. అదే సమయంలో చెట్టుపై పిడుగు పడి.. ఇలియాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఘటనలో గుంటూరు జిల్లా అమరావతిలో పల్లెకొండ అనే పశువుల కాపరి మరణించాడు. కృష్ణానది ఒడ్డున పశువులు కాస్తుండగా.. ఆయనపై పిడుగు పడింది. ఇక గుంటూరు జిల్లా రామాంజనేయ పురంలో పిడుగుపాటుకు 40 మేకలు మృతి చెందాయి. ఇదే ఘటనలో అక్కయ్య(38) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పిడుగు, వ్యక్తి మృతి, విశాఖపట్టణం, గుంటూరు, అమరావతి, పశువులు, సీలేరు, భారీ వర్షం, విద్యార్ధి, శ్రీకాకుళంThunder, person died, Visakhapatnam , sileru, heavy rain , Guntur , Amaravati , cattle, Student , Srikakulam -
విద్యుత్ ఉండగానే మరమ్మతులు!
ఇది హాట్‌లైన్ సిబ్బంది ప్రత్యేకత!! సీలేరు : విద్యుత్ ఉండగా వైర్లను ఎవరైనా ముట్టుకుంటారా? అలా తాకితే బతికి బట్టకడతారా? కానీ వీరు మాత్రం విద్యుత్ సరఫరా అవుతున్న తీగలతోనే గడుపుతారు. అయినా ఆ విద్యుత్ వీరిని ఏమీ చేయదు! వినడానికి ఒకింత ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజంగా నిజం!! ఆ కథాకమామిషూ ఏమిటంటే.. జెన్కో హాట్‌లైన్ విభాగం సిబ్బంది విజయవాడకు విద్యుత్ సరఫరా అవుతుండగానే మరమ్మతులు చేయడంలో దిట్టలు. ప్రస్తుతం రాష్ట్రంలో జలవిద్యుత్కేంద్రాల్లో తయారయ్యే విద్యుత్‌ను 220 కేవీ ద్వారా ఇతర ప్రాంతాలకు సరఫరా చేసే లైన్లకు మరమ్మతులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా జిల్లాలోని సీలేరు విద్యుత్ కాంప్లెక్స్‌లో రెండ్రోజులుగా విద్యుత్ లైన్లను బాగు చేస్తున్నారు. కళ్లు మాత్రమే కనిపించేలా ఒంటి నిండా రబ్బరుతో తయారు చేసిన ప్రత్యేక దుస్తులు ధరించారు. చేతులకు గ్లౌజుల్లాంటివి వేసుకున్నారు. గురువారం సీలేరు జలవిద్యుత్ కేంద్రం నుంచి గాజువాక, కొంబూరు సబ్స్టేషన్లకు సరఫరా అయ్యే 220 కేవీ విద్యుత్ లైన్‌ను మరమ్మతులు చేపట్టారు. విజయవాడ హాట్‌లైన్ సిబ్బంది విద్యుత్ సరఫరా అవుతుండగానే మరమ్మతులు చే శారు. విద్యుత్ సరఫరా జరుగుతున్నా అవలీలగా తీగల వెంబడి పాకుతూ, నిలబడుతూ ప్రాణాలకు తెగించి మరమ్మతు పనులు చేస్తుండడాన్ని చూసిన వారు ఔరా! అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. -
సీలేరు జల విద్యుత్ ఏపీకే!
-
సీలేరు జల విద్యుత్ ఏపీకే!
* వర్కింగ్ గ్రూపు అభిప్రాయం * పునర్వ్యవస్థీకరణ చట్టం పరిశీలించిన ఈఎన్సీలు * నివేదిక రూపకల్పనకు సమాయత్తం సాక్షి, హైదరాబాద్: సీలేరుపై ఉన్న రెండు జల విద్యుత్ కేంద్రాల ఉత్పత్తిలో తెలంగాణకు వాటా ఉండదని గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూపు భావిస్తున్నట్లు తెలిసింది. సీలేరు జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌లో 53.89 శాతం తెలంగాణకు వాటాగా ఇవ్వాలని, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోనూ విద్యుత్ ఉత్పత్తి విభజన గురించి స్పష్టంగా ఉందని ఇటీవలి గోదావరి బోర్డు సమావేశంలో తెలంగాణ వాదించింది. అయితే అంతర్ రాష్ట్ర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ)లేని ప్రాజెక్టులు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రానికే చెందుతాయని పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉందని, అందువల్ల సీలేరు విద్యుత్‌లో తెలంగాణకు వాటా రాదని ఏపీ వాదించింది. దీంతో ఈ అంశాన్ని అధ్యయనం చేసి నివేదిక ఇచ్చే బాధ్యతను వర్కింగ్ గ్రూపునకు బోర్డు అప్పగించింది. బోర్డు సభ్య కార్యదర్శి చంద్రశేఖరన్ అయ్యర్, రెండు రాష్ట్రాల ఇంజనీర్ ఇన్ చీఫ్‌లతో (ఈఎన్సీలు) వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేసి.. నివేదిక సమర్పించడానికి రెండు వారాల గడువు ఇచ్చింది. బోర్డు భేటీ తర్వాత ఈఎన్సీలు చర్చించుకున్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, సీలేరు విద్యుత్‌లో తెలంగాణకు వాటా ఉండదనే అభిప్రాయానికి వచ్చారు. ఇదే విషయాన్ని బోర్డు సభ్య కార్యదర్శికి నివేదించారు. ఈ మేరకు నివేదిక తయారు చేయడానికి వర్కింగ్ గ్రూపు సమాయత్తమవుతోందని తెలిసింది. ఈమేరకు రూపొందించనున్న నివేదికను బోర్డు చైర్మన్ మహేంద్రన్‌కు పంపనున్నారు. బోర్డు ఆమోదముద్ర వేస్తే మొత్తం 725 మెగావాట్ల విద్యుత్‌లో తెలంగాణకు వాటా లభించనట్టే. ఇప్పటికే ఈ మూడు కేంద్రాల నుంచి తెలంగాణకు విద్యుత్ ఇవ్వడం లేదు. -
బలమెల జలాశయంలో ప్రమాద స్థాయిలో నీటి మట్టం
పై-లీన్ తుపాన్ వల్ల ఉత్తరాంధ్రలోని భారీగా వర్షాలు కురిశాయి. దాంతో సీలేరు, డొంకారాయి, బలమెల జలాశయాలోకి భారీగా వర్షపు నీరు చేరుకుంది. దాంతో అధివారం ఉదయం నాటికి అయా జలాశయాల్లో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరింది. అయితే బలమెల జలాశయంలో నీరు గరిష్ట స్థాయికి మించి ప్రమాద స్థాయికి చేరుకుంది. దాంతో18 వేల క్యూసెక్కుల నీటీని అధికారులు ఆదివారం దిగువకు విడుదల చేశారు.