స్కూల్లో చెట్టు తొలగింపు.. రోడ్డున వెళ్లే వ్యక్తి మృతి | tree fell down: person died | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 30 2017 11:58 AM | Last Updated on Sat, Dec 30 2017 11:58 AM

tree fell down: person died

సాక్షి, పాలకొల్లు: ఎక్కడున్నా మృత్యువు కబళిస్తుందంటారు.. ఎవరో చెట్టు తొలగిస్తుంటే రోడ్డున వెళ్తున్న వ్యక్తిపై అది పడి మృతిచెందాడు. ఎవరూ ఊహించని విధంగా జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని శివదేవుని చిక్కాల గ్రామంలో జెడ్పీ హైస్కూల్‌ ఉంది. దాని ఆవరణలో ఉన్న ఓ భారీ చెట్టుపై కొందరి కళ్లుపడ్డాయి. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో దాన్ని అనధికారికంగా తొలగించే కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలో స్కూలు ముందునుంచి జాతీయ రహదారిపై వెళ్తున్న రావూరి రాము(24) అనే చిరు వ్యాపారిపై చెట్టు పడింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. వీరవాసరం గ్రామానికి చెందిన రాము పూలపల్లి బైపాస్ రోడ్డులో కూరగాయల వ్యాపారం ముగించుకుని ఇంటికి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement