west godavari distric
-
అందం అలరించే..!
గోదావరి అలలపై తేలియాడే పడవలు.. పాపి కొండల నడుమ గలగల నీటి సవ్వడులు.. కొండలతో దోబూచులాడే దట్టమైన మేఘాలు.. ఇలా పశ్చిమ ఏజెన్సీలో గోదావరి అందాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి.. ప్రస్తుతం జిల్లాలో వరద నీటికి పరవళ్లు తొక్కుతోన్న గోదావరి ఓ పక్క భయపెడుతూనే.. మరో పక్క ఇదిగో ఇలా తన అందాలతో అలరిస్తోంది. -
తండ్రిని కర్రతో కొట్టి చంపిన కొడుకు
సాక్షి, పశ్చిమగోదావరి : జిల్లాలోని దుర్భగూడెం విషాదం చోటుచేసుకుంది. మద్యం తాగి వస్తున్న తండ్రిని ఓ కొడుకు హతమార్చాడు. రోజూ మద్యం తాగి వచ్చి భార్యను, కొడుకులను తిడుతుండటంతో.. ఆ తండ్రి(బత్తుల ప్రసాదరావు (59) కర్రతో దాడిచేశాడు. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. -
వైఎస్సార్సీపీలోకి ఆర్యవైశ్యుల చేరిక
సాక్షి, కొవ్వూరు: రానున్న ఎన్నికల్లో ఆర్యవైశ్యులంతా వైఎస్సార్సీపీకి అండగా నిలవాలని ఆ పార్టీ సీజీసీ సభ్యులు పెండ్యాల కృష్ణబాబు కోరారు. పట్టణంలో సాయిలక్ష్మి రెసిడెన్సిలో మంగళవారం నిర్వహించిన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కృష్ణబాబు మాట్లాడుతూ విశాఖపట్నం నుంచి వచ్చిన మహిళకు టీడీపీ వారు టిక్కెట్టు ఇస్తే, ఇక్కడ స్థానికురాలైన తానేటి వనిత వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారన్నారు. వివాద రహితురాలిగా ఉండే వనితను గెలిపించుకుంటే రానున్న రోజుల్లో అందరికీ మేలు చేస్తారని చెప్పారు. అలాగే ఎంపీ అభ్యర్థి మార్గాని భరత్‌రామ్‌ని గెలిపించాలని కోరారు. తాను ఎప్పటికీ మీ మనిషిగానే అందుబాటులో ఉంటానని సూచించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోడూరి శివరామకృష్ణ, వాసవీక్లబ్ అధ్యక్షురాలు ఉప్పల శ్రీవల్లి, వాసవీక్లబ్ జోన్ చైర్మన్ కాశీ అన్నపూర్ణ మాట్లాడుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. వైఎస్సార్ సీపీకి ఆర్యవైశ్యులంతా అండగా ఉంటామని ఆ సంఘం నాయకులు మద్దతు పలికారు. పార్టీ నాయకుడు వాసవీక్లబ్ ఇంటర్ నేషనల్ ప్రోగాం కో–ఆర్డినేటర్ వలివేటి ప్రసాద్, కాకి అనిల్ సూర్య సారథ్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో వాసవీక్లబ్ అధ్యక్షుడు ఉప్పల రవికుమార్, ఆర్యవైశ్య సంఘ నాయకులు మన్యం ఈశ్వర్, చక్కా సూర్య గౌతమ్, గ్రంధి గౌతమ్, దేవతు కృష్ణప్రసాద్, రాఘవ రమాకాంత్, నాగవరపు హనుమంతు, పీఎల్ రామ్‌కుమార్, తీగెల రవికుమార్, ముత్తా రామారావు, సత్యవరపు గురున్నాధం, జల్లూరి శ్రీకాంత్, అద్ధెపల్లి మూర్తితో పాటు మాజీ కౌన్సిలర్ బాలదారి బాబ్జీ వైఎస్సార్ సీపీలో చేరారు.కృష్ణబాబు, శివరామకృష్ణలు వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కొల్లేపర శ్రీనివాస్, ఆర్యవైశ్యులు పాల్గొన్నారు. -
హత్యలు.. దాడులు.. దౌర్జన్యాలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న ఏలూరులో నడిరోడ్డుపై నరుక్కొని చంపుకోవడాలు, హత్యలు, హత్యాయత్నాలతో ఇక్కడ భయపడుతూ బతికే పరిస్థితి ఏర్పడింది. పట్టపగలే తనకు అడ్డువస్తున్నాడని ఒక న్యాయవాదిని హత్య చేయించిన ఘటన సంచలనం రేపింది. ఆ తర్వాత కూడా నగరంలో రౌడీషీటర్ల హత్యలు, హత్యాయత్నాలు, తుపాకీ కాల్పులతో ఇక్కడ బతుకు భద్రం కాదనే పరిస్థితికి తెలుగుదేశం నేతలు తీసుకువచ్చారు. జిల్లా కేంద్రంలో టీడీపీ నేతల భూకబ్జాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. విలువైన స్థలాలు, కోర్టు పరిధిలో ఉన్న స్థలాలను ఆక్రమించుకున్నారు. ఆఖరికి స్కూలు స్థలాలు, చెరువులను కూడా వదిలిపెట్టలేదు. ఈ ఐదేళ్లలో అధికార పార్టీ నేతలు చేసిన భూకబ్జాలు సుమారు రూ.70 కోట్ల నుంచి రూ.80 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. పెచ్చుమీరిన చింతమనేని ఆగడాలు దళితులకు పదవులెందుకంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దగ్గర నుంచి ఇసుక అక్రమాలను అడ్డుకున్న తహసీల్దార్ వనజాక్షిని జుట్టుపట్టుకుని ఈడ్చిన సంఘటనతో పాటు దెందులూరు అరాచకాలకు అడ్డాగా మారింది. ఈ ఐదేళ్లలో తన మాట వినలేదని గతంలో పెదవేగి ఎస్సైపై దాడి చేశారు. దీనిపై కేసు సైతం నమోదైంది. అటవీ అధికారి, మార్కెటింగ్ శాఖ అధికారులపైనే దాడికి పాల్పడిన ఘటనలు అనేకం ఉన్నాయి. అంతేకాకుండా తన ఇసుక దందాను అడ్డుకున్నారని ముసునూరు మహిళా తహసీల్దార్ వనజాక్షిని జట్టు పట్టుకుని మరీ దాడికి పాల్పడిన ఘటన అప్పట్లో రాష్ట్రంలోనే సంచలనం రేపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు చింతమనేనిని వెనకేసుకురావడంతో ఆయన ఆగడాలకు అంతులేకుండా పోయింది. గుండుగొలను సెంటర్లో బందోబస్తు చేస్తున్న ఏఎస్సై, సీపీఓలపై దాడికి పాల్పడ్డారు. ఇళ్లస్థలాలు, పొలాలు గొడవల పేరుతో ఇలా ప్రతిరోజు ఎవరోఒకరిని కొడుతూ రౌడీలా చెలామణి అవుతున్నా పోలీసులు ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉంటున్నారు. చివరికి జర్నలిస్టులను సైతం వదలని పరిస్థితి నెలకొంది. దెందులూరు నియోజకవర్గంలో ఓ మాఫియా కింగ్‌లా చింతమనేని వ్యవహరిస్తున్నారు. ఇసుక, మట్టి, చెరువుల భూములు ఇలా అన్నింటినీ దోచేస్తున్నా అడిగే నాథుడే లేకుండాపోయాడు. 2000 సంవత్సరంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం హయాంలోనే చింతమనేని ప్రభాకర్‌పై ఏలూరు త్రీటౌన్‌లో రౌడీషీట్‌ను సైతం పోలీసులు తెరిచారు. కారుతో గుద్ది శ్రీగౌతమి హత్య నరసాపురంలో తెలుగుదేశం నేతలు రెచ్చిపోయారు. ఒక నేత, పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి తాను రహస్యంగా రెండోపెళ్లి చేసుకున్న యువతిని కడతేర్చారు. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న శ్రీగౌతమి అనే యువతిని ప్రేమ పేరుతో రహస్యంగా రెండోపెళ్లి చేసుకున్న సజ్జా బుజ్జి అనే నేత, నరసాపురం జెడ్పీటీసీతో పాటు మరికొందరిని కలుపుకుని తన చెల్లెలితో పాటు బండిపై వెళ్తున్న గౌతమిని కారుతో గుద్దించి చంపడం సంచలనం రేపింది. సీఐడీ పోలీసులు సక్రమంగా స్పందించడంతో నిందితులు జైలుకు వెళ్లారు. రెచ్చిపోయిన ఇసుక మాఫియా జిల్లాలో గడిచిన ఐదేళ్లలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. ఉచిత ఇసుక విధానంలో టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు రూ.కోట్లు కొల్లగొట్టారు. ్ర ఇసుక మాఫియాతో విబేధాలతో కొవ్వూరు పురపాలక సంఘంలో 16వ వార్డు కౌన్సిలర్‌గా పనిచేసిన పాకా గోపాలకృష్ణ 2016 ఏప్రిల్ 2న దారుణహత్యకు గురయ్యారు. ఔరంగబాద్ ఇసుక ర్యాంపులో చోటు చేసుకున్న వివాదమే ఈయన హత్యకు దారితీసింది. ర్యాంపులో టీడీపీ నాయకులు ఆధిపత్యం కోసం అదే పార్టీకి చెందిన గోపాలకృష్ణను అత్యంత దారుణంగా పట్ట పగలు నడిరోడ్డుపైనే కిరాతకంగా నరికి చంపారు. అనంతరం 2017 సెప్టెంబర్ 13న ఓ యువకుడ్ని కొందరు యువకులు అత్యంత దారుణంగా నరికి చంపారు. బస్టాండ్ జంక్షన్లో పట్టపగలు యువకుడు రోడ్డుపైన కత్తులతో దాడి చేసి కిరాతకంగా హతమార్చారు. ఈ హత్యలో కీలక నిందితుడు మంత్రి కేఎస్ జవహర్ కుమారుడికి అనుచరుడిగా ఉండేవారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గడిచిన ఐదేళ్లుగా జిల్లాలో జరిగిన రౌడీయిజం, ఇసుక మాఫియాతో ప్రజలు విసుగెత్తిపోయారు. ఈసారి ఎన్నికల్లో జిల్లా ప్రజలు పూర్తిస్థాయిలో మార్పు కోరుకుంటున్నారు. ప్రస్తుత పాలకులకు బైబై చెప్పాలని నిర్ణయించుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా అంటే గుర్తుకు వచ్చేది ప్రశాంతత.. పచ్చదనం. అయితే గడిచిన ఐదేళ్ల కాలంలో పశ్చిమగోదావరి అంటే రౌడీయిజం, తమకు నచ్చని వారిని తుదముట్టించడం, బెదిరింపులు, దాడులు, దౌర్జన్యాలు నిత్యకృత్యంగా మారాయి. మాట విననివారిని తప్పుడు కేసుల్లో ఇరికించడం, వేధించడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో జిల్లాలో ప్రశాంతత రావాలంటే ఈ రౌడీరాజ్యానికి స్వస్తి పలకాలని ఓటర్లు ఒక నిర్ణయానికి వచ్చారు. -
శ్రీనివాసుని తాకిన రవికిరణాలు
సాక్షి, ద్వారకాతిరుమల: సాయం సంధ్య వేళ.. సూర్య భగవానుని కిరణాలు గర్భాలయంలో కొలువైన శ్రీనివాసుని అపాదమస్తకం స్ప్రుశించే శుభసమయంలో.. వీక్షించిన భక్తులు ఆనంద పారవశ్యంలో మునిగారు. ప్రతి ఏటా చైత్ర మాసం ముందు రోజుల్లో సాక్షాత్కరించే ఈ అరుదైన ఘట్టం పురాతన దేవాలయమై, శ్రీవారి క్షేత్ర ఉపాలయంగా విరాజిల్లుతోన్న లక్ష్మీపురంలోని శ్రీ సంతాన వేణుగోపాల జగన్నాథ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం ఆవిష్కృతమైంది. ఎక్కడా ఏ ఆలయంలో లేని విధంగా ఇక్కడ ఇలా సూర్యకిరణాలు నేరుగా స్వామి, అమ్మవార్లను తాకడం ఒక విశిష్టతగా చెప్పొచ్చు. ఎంతో లోపలికి ఉండే ఈ ఆలయంలోని స్వామివారి గర్భాలయంలోకి సైతం నేరుగా సూర్యకిరణాలు ప్రవేశించి శ్రీవారిని అణువణువు అర్చించి వెళ్తాయి. ఆలయం ముందు చెట్లు, ధ్వజస్తంభం, పందిళ్లు ఉన్నా వాటిని తప్పించుకుని మరీ లోపలకు వచ్చి స్వామివారిని అర్చించడం పలువురిని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ప్రతి సంవత్సరం చైత్ర మాసం ముందు రోజుల్లో, వరుసగా మూడు రోజులు సాయంత్రం సూర్యాస్తమయ సమయాన్న అద్భుత కాంతులతో సూర్యకిరణాలు నేరుగా ఆలయంలోకి ప్రవేశించి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ముఖం మీద నుంచి నెమ్మదిగా కిందకు దిగుతూ పాదాల వరకు అర్చించుతాయి. ఇలా అణువణువు అర్చిస్తూ దిగిన ఈ సూర్యకిరణాలు స్వామివారి పాదాల వద్ద ఉన్న ఉత్సవ మూర్తులను తాకి అనంతరం సూర్యకిరణం రెండుగా చీలి ఇరుపక్కలా ఉన్న పద్మావతి, ఆండాళ్ అమ్మవార్ల ఆలయంలోకి ప్రవేశించి అమ్మవార్లను అర్చిస్తాయి. ఏడాదిలో ఈ వింత మూడు రోజులు మాత్రమే జరగడం ఇక్కడి విశిష్టత. ఈ కిరణాలను చూసేందుకు ఈ మూడు రోజులు భక్తులు ఆసక్తిగా ఆలయానికి తరలివస్తారు. బుధవారం కూడా ఈ కిరణాలు పడే అవకాశం ఉందని ఆలయ అర్చకులు గోపీ తెలిపారు. -
మహిళ సజీవ దహనం
సాక్షి, తాళ్లపూడి: మండలంలోని గజ్జరం గ్రామంలోని కాలనీ వద్ద సోమవారం జరిగిన అగ్నిప్రమాదంలో ఓ మహిళ సజీవ దహనం అయిన ఘటన చోటుచేసుకుంది. తాళ్లపూడి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చిక్కాల సోమాలమ్మ (32) ఉదయం 9.30 సమయంలో ఇంట్లో వంట చేస్తుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు ఎగసి పడ్డాయి. ఒంటికి నిప్పంటుకోవడంతో ఆమె మంటల్లో కాలిపోయినట్టు తెలిపారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యిందా లేక గ్యాస్ వల్ల ప్రమాదం జరిగిందా మరేదైనా కారణమా అనేది తేలాల్సి ఉంది. ఒక్కసారిగా మంటలు వ్యాపించి బంగాళా పెంకుటిల్లుకు మంటలు అంటుకోవడంతో చుట్టుపక్కల వారు మంటలను అదుపుచేయడానికి ప్రయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపుచేశారు. అయితే అప్పటికే సోమాలమ్మ పూర్తిగా కాలిపోవడంతో మృతిచెందడం జరిగింది. శరీరభాగాలు మొత్తం కాలిపోయాయి. సంఘటనా స్థలంలో బంధువుల రోదనలతో మారుమోగింది. మృతురాలి భర్త చిక్కాల శ్రీను లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మల్లిక తాళ్లపూడిలోని కళాశాలలో డీఈడీ చదువుతున్నారు. రెండో కుమార్తె తేజస్వి స్థానిక ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నారు. తాళ్లపూడి ఎస్సై కేవై దాస్ సంఘటనా స్థలంలో వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు తరలించారు. తహసీల్దార్ బి.దేవి, రెవెన్యూ సిబ్బంది వివరాలు సేకరించారు. -
అర్బన్ హౌసింగ్‌లో అక్రమాలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఇసుక, మట్టి, నీరు ఇలా దేన్నీ వదలని తెలుగు తమ్ముళ్లు.. ఇళ్ల కేటాయింపులోనూ చేతివాటం చూపించారు. పేదవాడి సొంతింటి కలపై పచ్చ రాజకీయం స్వారీ చేస్తోంది. ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులు ఎక్కువ... మంజూరైనవి తక్కువ కావడంతో డిమాండ్ ఎక్కువై రేటు మరింత పెంచేశారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద జిల్లాలో చేపడుతున్న అర్బన్ హౌసింగ్‌కు ఒక్కో ఇంటి కేటాయింపు కోసం భారీగా వసూళ్లు చేశారు. లబ్ధిదారులకు ఇవ్వవలసిన పొజిషన్ సర్టిఫికెట్లకు ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.రెండు నుంచి రూ.5 వేలు వసూలు చేస్తున్నట్లు ఎన్టీఆర్ గృహనిర్మాణ లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. పట్టణ పేదలకు సొంతింటి కల సాకారం అయ్యేందుకు ఇంకా చాలా సమయం పట్టనుంది. జిల్లా వ్యాప్తంగా రెండు దశల్లో నిర్మించాలని తలపెట్టిన ఇళ్లు 44,260 కాగా, ఇప్పటి వరకూ ఎనిమిది వేలు మాత్రమే పూర్తి అయ్యాయి. ఎన్నికల సమయానికి మరో పదివేలకు మించి పూర్తి అయ్యే అవకాశం కనపడటం లేదు. ఎన్నికలు ముందుకు వస్తుండటంతో హడావిడిగా పూర్తి అయిన ఇళ్లకు ఈ నెల 20 గృహ ప్రవేశాలు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. స్థలం లేని కారణంగా 11,710 ఇళ్ల నిర్మాణం అసలు ప్రారంభం కాలేదు. ఏలూరు నగరంలో హౌస్ ఫర్ ఆల్ పథకం కింద నగరంలోని పేద ప్రజలకు 11,816 ఇళ్లు మంజూరయ్యాయి. అయితే వాటిని నిర్మాణ పనులు ఇటీవలే చేపట్టారు. మొత్తం మూడు కేటగిరీలుగా ఈ ఇళ్ల నిర్మాణ పనులు చేపడుతున్నారు. రూ.500, రూ.50 వేలు, రూ.లక్ష మొదటగా చెల్లించాల్సి ఉండగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీ మినహాయిపు పోను మిగిలిన మొత్తానికి రుణాలుగా ఇప్పించేందుకు నగరపాలకసంస్థ అధికారులు బ్యాంకుల ఖాతాలను తెరుస్తున్నారు. మొత్తం 66 ఏకరాల్లో సుమారు 6,400 ఇళ్ల నిర్మా ణం జరుగుతుంది. ఇంకా 5,416 ఇళ్ల నిర్మాణానికి స్థలం కావాల్సి ఉండడంతో అధికారులు స్థలాన్ని సేకరించే పనుల్లో పడ్డారు. పాలకొల్లులో 6,784 ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. అందులో 2,500 మాత్రమే పూర్తి అయ్యాయి. లబ్ధిదారులకు పాలకొల్లు పట్టణంలో 19 బ్యాంకులు కేటాయించారు. వీటిలో ఒక్కో బ్యాంకుకు 352 మంది లబ్ధిదారులను కేటాయించారు. కాని కొన్ని బ్యాంకులు 60 సంవత్సరాలు ఉన్న లబ్ధిదారులకు నరకం చూపిస్తున్నారు. మీకు రుణం ఇవ్వడం కుదరదని చెపుతున్నారు. భీమవరంలో జీప్లస్ 3 తరహాలో 8,352 ఇళ్లు 12వ వార్డు తాడేరు రోడ్డులో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో సేకరించిన 82 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఇందులో ఇప్పటి వరకూ మూడు వేల ఇళ్ల వరకు పూర్తి అయ్యాయి. తాడేపల్లిగూడెం మునిసిపాలిటీ పరిధిలో 5,376 ఇళ్లు కేటాయించారు. దరఖాస్తులు ఆహ్వానించడం దగ్గర నుంచి ఇళ్ల కేటాయింపు వరకు టీడీపీ నాయకులదే హవాగా సాగింది. అధికారిక వార్డు కౌన్సిలర్లు దరఖాస్తు ఫారంపై సంతకం చేసి పంపిన వాటినే మునిసిపల్ ఉద్యోగులు ఆన్లైన్ చేశారు. నిడదవోలులో రెండోదశలో మంజూరు చేశారు. 1,248 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. పట్టణానికి 3 కిలోమీటర్ల దూరాన వీరుగూడెం 25వ వార్డులో మొదటి విడతగా 13 ఎకరాలను కొనుగోలు చేశారు. టీడీపీ నాయకులు వారి అనుచరులకు, జన్మభూమి కమిటీలు నిర్ణయించిన పార్టీ శ్రేణులకు మాత్రమే గృహాలను మంజూరు చేశారు. కొవ్వూరులో 1,904 మందికి ఇళ్లు మంజూరు చేశారు. దీనిలో భాగంగా పట్టణంలో 7.51 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. దీనిలో ఎకరంన్నర భూమికి కోర్టు వివాదం కారణంగా ఆటంకం ఏర్పడింది. మిగిలిన భూమిలో ఇళ్ల నిర్మాణ ప్రక్రియ ప్రారంభించారు. ఈ స్ధలం కేవలం 480 మందికి మాత్రమే సరిపోతుంది. మిగిలిన వాళ్ల ఇళ్ల నిర్మాణం చేద్దామన్నా మళ్లీ భూసేకరణ చేపట్టాల్సి ఉంది. జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ పరిధిలో పట్టణ శివారు 1వ వార్డు మార్కండేయపురంలో అర్బన్ హౌసింగ్ నిర్మాణ పనులు చేపట్టారు. అయితే ఇది పట్టణానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో చేపట్టారు. మొదటి దశ కోసం 1056 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అయితే సాధికార సర్వే ప్రకారం దానిలో ఉన్న లోపాలు కారణంగా చాలా మంది ఇళ్లు లేని వారికి ఇళ్లు మంజూరు కాలేదు. ఇకే ఇంట్లో మూడు కుటుంబాలు ఉన్నప్పటికీ మూడు కుటుంబాలకు ఇల్లు ఉన్నట్లు సాధికార సర్వేలో నమోదు కావడంతో ఆ ముగ్గురిలో ఇద్దరు ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇల్లు మంజూరు కాలేదు. దీంతో ప్రజలు నగర పంచాయతీ చుట్టూ తిరుగుతున్నారు. నర్సాపురంలో స్థలాభావం వల్ల ఈ ప్రాజెక్టు అడుగు ముందుకు పడలేదు. మొత్తం మంజూరైన ఇళ్లు 44,260 పూర్తి అయినవి 8000 పూర్తి కావాల్సినవి 36,260 -
జగన్ హామీపై ఆర్టీసీ సంఘాల హర్షం
సాక్షి, ఏలూరు టౌన్ : నష్టాల ఊబిలో కూరుకుపోతున్న ఏపీఎస్ ఆర్టీసీని తాను అధికారంలోకి రాగానే ప్రభుత్వంలో విలీనం చేస్తామని అనంతపురం మడకశిర బహిరంగ సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇవ్వటం పట్ల ఆ వర్గాల్లో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా ఏలూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఏలూరు నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్సీ ఆళ్ల నానికి ఆర్టీసీ సంఘాల నేతలు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్టీసీ ఎన్ఎంయూ రాష్ట్ర మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి ఆర్‌వీవీఎస్‌డీ ప్రసాద్, ఎన్ఎంయూ ఏలూరు డిపో గౌరవాధ్యక్షులు ఎంఆర్డీ బలరాం, రిటైర్డ్ యూనియన్ నాయకులు ఆళ్ల నానిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రావూరి ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 55 వేల ఆర్టీసీ కుటుంబాలకు ఈ నిర్ణయం ద్వారా మేలు చేసినట్లు అవుతుందన్నారు. ప్రభుత్వ అనుబంధ రంగ సంస్థ ఆర్టీసీ అనేక సంవత్సరాలుగా నష్టాల్లో ఉందని, ఉద్యోగులు, కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేలా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో విలీనం చేస్తామనే నిర్ణయాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ కార్మిక కుటుంబాలు వైఎస్ జగన్ వెంటే ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎంవీఆర్‌ఆర్ కుమార్, బసవరాజు, కె.పాండు, జీపీఆర్ ప్రసాద్, ఎంవీఆర్‌ఎం రావు, బెనర్జీ తదితరులు ఉన్నారు. -
పశ్చిమ గోదావరి జిల్లా: నామినేషన్ల పరిశీలన పూర్తి
సాక్షి ప్రతినిధి, ఏలూరు: లోక్‌సభ, అసెంబ్లీ నియోజక వర్గాలకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన ముగిసింది. మొత్తం మీద 52 నామినేషన్లను తిరస్కరించినట్లు జిల్లా ఎన్నికల అధికారులు తెలిపారు. ఇందులో పార్లమెంట్‌కు సంబంధించి ఐదు నామినేషన్లు ఉండగా, 47 నామినేషన్లు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినవి. ఏలూరు, నర్సాపురం లోక్‌సభకు సంబంధించి 32 నామినేషన్లు దాఖలు కాగా ఐదు తిరస్కరణకు గురి కావడంతో ప్రస్తుతం 27 మంది అభ్యర్థుల నామినేషన్లు అంగీకారం పొందాయి. అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 234 మంది నామినేషన్లు దాఖలుకాగా అందులో 47 నామినేషన్లు తిరస్కరణకు గురి కావడంతో 187 నామినేషన్లు అంగీకారం పొందాయి. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థుల నామినేషన్లు అన్నీ ఆమోదం పొందాయి. తిరస్కరణకు గురి అయిన నామినేషన్లలో ఎక్కువ శాతం డమ్మీ అభ్యర్థులవే ఉన్నాయి. పార్లమెంట్ స్థానం మొత్తం నామినేషన్లు ఆమోదం తిరస్కరణ నర్సాపురం 20 17 3 ఏలూరు 12 10 2 అసెంబ్లీ మొత్తం నామినేషన్లు ఆమోదం తిరస్కరణ ఏలూరు 10 9 1 నర్సాపురం 17 15 2 చింతలపూడి 21 11 10 తణుకు 26 18 8 తాడేపల్లిగూడెం 20 15 5 కొవ్వూరు 17 14 3 గోపాలపురం 10 7 3 నిడదవోలు 14 11 3 పాలకొల్లు 40 31 9 పోలవరం 20 17 3 భీమవరం 17 15 2 ఆచంట 18 15 3 ఉండి 15 12 3 తణుకు 18 16 2 ఉంగుటూరు 10 8 2 -
రాష్ట్ర విభజనకు బాబే కారణం
సాక్షి, ఆకివీడు: రాజకీయాలకు అర్థాన్ని చెరిపేశారు. హత్యారాజకీయాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదం. అధికార దాహంతో రాజకీయాలు, పాలన చేయడం అత్యంత దారుణం. రాష్ట్ర విభజనకు చంద్రబాబే కారణం అని అన్నారు ఆకివీడు మండలం కుప్పనపూడికి చెందిన భూదానోద్యమకర్త, సీనియర్ పొలిటీషియన్ కట్రెడ్డి గజపతిరావు. సంఘ సేవకుడు, గాంధేయవాది, సమాజవాది, సీనియర్ ఓటర్‌గా ఉన్న ఆయన ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనపై ఆయన నిప్పులు చెరిగారు. 1952 నుంచి ఇప్పటినుంచి ప్రతి ఎన్నికల్లో ఓటు వేస్తున్న ఆయన అంతరంగాన్ని ‘సాక్షి’ ఎదుట ఆవిష్కరించారు. బాబు వల్లే రాష్ట్ర విభజన తెలుగు రాష్ట్రం ముక్కలు కావడానికి చంద్రబాబే కారణం. చంద్రబాబు దారుణాల్లో రాష్ట్రం విడిపోవడం ఒకటి. విభజనకు ముందుగా లేఖ ఇచ్చింది ఆయనే. తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రులు కారుచౌకగా ఆస్తులు కొనుగోలు చేసి, తెలంగాణవాసుల్ని బికారులను చేశారు. ఆంధ్రుల సొమ్మంతా హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టి.. తెలంగాణ ప్రజలు చేతులు కట్టుకునేలా చేయడం వల్లే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చింది. హత్యారాజకీయాలు దారుణం హత్యారాజకీయాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయి. వీటిని సహించకూడదు. అధికారం కోసం ప్రజలతో మమేకమవ్వాలేగాని, ప్రత్యర్థుల్ని హతమార్చి అధికారంలోకి రావాలనుకోవడం సరికాదు. నా రాజకీయ చరిత్రలో ప్రస్తుతం జరుగుతున్న హత్యారాజకీయాలను గతంలో ఎన్నడూ చూడలేదు. వైఎస్సార్ మాదిరిగానే జగన్ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన ప్రజల గుండెల్ని హత్తుకుంది. ఆయన పథకాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. వాటిని ఎవరు అమలు చేస్తారా అనే ఆతృతలో ప్రజలు ఉన్నారు. వైఎస్సార్ పథకాల్ని జగన్మోహన్రెడ్డి అమలుజరుపుతారనే నమ్మకం ప్రజలకు ఉంది. ఆరోగ్యశ్రీ ప్రజలకు ఎంతో అవసరం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పేద విద్యార్థుల జీవితాలు బాగుపడ్డాయి. పోలవరం.. అవినీతిమయం ఎన్నో ఏళ్ల పోలవరం ప్రాజెక్ట్ కలను సాకారం చేసిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుంది. ఆయన హయాంలోనే కాలువలు తవ్వారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ పేరుతో సొమ్మును దోచేస్తున్నారు. పనుల్లో నాణ్యత లేదు. ప్రాజెక్టు సర్వం నాశనమవుతుంది. ఈ ప్రాంతంలో రోడ్లు పగుళ్లు తీస్తున్నాయి. నాణ్యతలేమి, డొల్లతనం కన్పిస్తుంది. రానున్న రోజుల్లో ఇంకేమి చూడాలోనని భయమేస్తోంది. ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగితే అది భవిష్యత్తరానికి శాపంలా పరిణమిస్తోంది. పోలవరం ప్రాజెక్ట్‌ను ఈ ప్రభుత్వ హయాంలో కట్టవద్దని నా మనవి. అన్నదాతలకు అండగా వైఎస్సార్ రైతు అనే నేను బతికి బట్టకట్టానంటే అదంతా వైఎస్సార్ పుణ్యమే. అప్పుల ఊబిలో బతుకుతూ పంట పొలాలున్నా బీదరికంతో గడిపాను. వ్యవసాయం ఉండి అప్పులతో కుమిలిపోతున్న నాకు మూడు పంటలు పోతే నష్టపరిహారం, బీమా చెల్లించి ఆదుకున్న ఘనుడు వైఎస్సార్. ఆయన దయవల్లే నేను నిలబడగలిగాను. నాలాంటి ఎందరికో ఆయన భరోసా ఇచ్చారు. జగన్ కూడా తండ్రి మాదిరిగా పాలన చేస్తారనే నమ్మకం నాకు ఉంది. సీఎంవి అసంబద్ధ ప్రేలాపనలు జగన్‌పై కోడి కత్తితో హత్యాయత్నం చేయడం దారుణం. ప్రజల అదృష్టం వల్ల జగన్ బతికాడు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య దారుణం. దీనిపై విచారణ చేయించాల్సిన సీఎం అసంబద్ధ ప్రేలాపనలు సరికాదు. -
ఎన్నికల విధుల్లో పక్షపాతం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ విధులు పురమాయించడంలో సంబంధిత అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆ వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. జిల్లాలో ఎన్నికల విధుల బాధ్యతల పురమాయింపు నిక్ సెంటర్ కోఆర్డినేటర్ శర్మ పరిధిలో ఉంటుంది. అయితే ఆయన ఎన్నికల కమిషన్ నిబంధనలు తుంగలో తొక్కి మినహాయింపు ఇవ్వాల్సిన అంధులు, వికలాంగులు తదితరులకు ఎలక్షన్ డ్యూటీ వేయడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఒక్కో పోలింగ్ బూత్‌లో పోలింగ్ అధికారి, మరో ఐదుగురు ఉద్యోగులను నియమించాల్సి ఉండగా సిబ్బంది కొరత చూపుతూ పోలింగ్ అధికారి, మరో నలుగురు ఉద్యోగులను మాత్రమే వేయటంతో పనిఒత్తిడి తీవ్రంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలో 3,411 పోలింగ్ స్టేషన్లు జిల్లాలో 3,411 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో విధులు నిర్వహిం చేందుకు 16 మంది నోడల్ అధికారులను, 15 మంది రిటర్నింగ్ అధికారులను, 48 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను 334 మంది సెక్టార్ అధికారులను, 3,411 మంది పాటు బూత్ స్థాయి అధికారులను నియమించారు. ఒక్కో పోలింగ్ స్టేషన్‌కు నలుగురు ఉద్యోగులను నియమించారు. అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో ఒక్కో పోలింగ్ స్టేషన్లో సుమారు 1,450 మంది ఓటర్లు రెండు ఓట్లు వేస్తారు. అంటే ఒక్కో పోలింగ్ స్టేషన్లో 2,900 ఓట్లు పడనున్నాయి. విధి నిర్వహణ మరింత కష్టమౌతుందని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. ప్రతి పోలింగ్ స్టేషన్‌కు మరో ఉద్యోగిని నియమించాలని కోరుతున్నారు. గంట కూడా విరామం లేకుండా.. అధికారులు చెప్పిన దాని ప్రకారం పోలింగ్ విధుల్లో ఉన్న ఉద్యోగులు కనీసం భోజనానికి కూడా వెళ్లే పరిస్థితి ఉండదు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ వారు నిర్విరామంగా పనిచేయాల్సి ఉంటుంది. నిక్ సెంటర్ కోఆర్డినేటర్‌పై ఉద్యోగుల ఆగ్రహం ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అంధులకు, వికలాంగులకు, గర్భిణులకు, 6 నెలల్లో పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులకు ఎన్నికల విధులు వేయకూడదు. కానీ నిక్ సెంటర్ కోఆర్డినేటర్ శర్మ మాత్రం తన ఇష్టానుసారం విధులు వేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం ఎన్నికల విధులు కేటాయించిన వారిలో పై కేటగిరీల ఉద్యోగులు కూడా ఉన్నారు. దీనిపై సదరు అధికారిని ప్రశ్నిస్తే సిబ్బంది కొరత ఉన్నందున వారికి కూడా విధులు కేటాయించక తప్పడం లేదని అంటున్నారని వాపోతున్నారు. అన్ని అవయవాలూ సక్రమంగా ఉండి పూర్తి ఆరోగ్యంగా, వయసులో ఉన్న ఉద్యోగులు కూడా కొంతమందికి ఎన్నికల విధులు పడలేదని తెలుసుకుని ఇతర ఉద్యోగులు ఆశ్చర్యపోతున్నారు. ఎన్నికల విధుల నుంచి తప్పించుకోవాలనుకున్న ఉద్యోగులు సదరు అధికారిని నేరుగా కలిస్తే సరిపోతుందని చెబుతున్నారు. ఆయనను వ్యక్తిగతంగా కలిసిన వారిలో సుమారు 500 మందికి ఎన్నికల విధులు పడలేదంటున్నారు. నిబంధనల మేరకు సడలింపు ఉన్న వారికి డ్యూటీ పడితే వారు కలెక్టర్‌ను కలిసి మినహాయింపు కోరవచ్చు. సడలింపు ఉన్నవారికి విధులు వేయరాదు నిబంధనల ప్రకారం ఎలక్షన్ డ్యూటీకి సడలింపు వర్తించే వారికి ఎట్టి పరిస్థితిలోనూ డ్యూటీ వేయకూడదు. వారికి డ్యూటీ వేయడం, తిరిగి వారు కలెక్టర్‌ను కలిసి తమ ఇబ్బంది చెప్పుకోవడం సమయం తీసుకునే ప్రక్రియ. ఈ నెల 28 లోపు వారికి కలెక్టర్ అందుబాటులో లేకపోతే ఆ తేదీన వారికి నియోజకవర్గాలు కూడా కేటాయించేస్తారు. అప్పుడు సడలింపు ఇవ్వడం అస్సలు కుదరదు. – షేక్ సాబ్జి, రాష్ట్ర అధ్యక్షుడు, యూటీఎఫ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలి రెండు ఎన్నికలూ ఒకేసారి ఉన్నప్పుడు సిబ్బందిని పెంచాల్సి ఉంది. సిబ్బంది కొరత ఉందని కొద్దిమందిని మాత్రమే నియమిస్తే వారిపై పనిభారం అధికమౌతుంది. అలాంటప్పుడు ప్రభుత్వమే జీతాలు ఇచ్చే కాంట్రాక్టు లెక్చరర్లు, విద్యా వలంటీర్లు, ఆశ వర్కర్లు, ఐఈఆర్పీ టీచర్లు వంటి వారిని కూడా ఎన్నికల విధుల్లోకి తీసుకుంటే, ఎన్నికలు సజావుగా ముగించవచ్చు. – గుగులోతు కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీటీఎఫ్ -
పవన్ నీస్థాయి దిగజార్చుకోవద్దు
సాక్షి, భీమవరం: జనసేన అధ్యక్షుడిగా రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమం గురించి మాట్లాడాల్సిన పవన్ కల్యాణ్ భీమవరంలో పరిస్థితులు తెలియకుండామాట్లాడి స్థాయిని దిగజార్చుకోవడం, ప్రజల్లో చులకన కావడం పవన్ అభిమానిగా బాధించిందని వైఎస్సార్ సీపీ భీమవరం నియోజవర్గ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. తన హయాంలో భీమవరంలో జరిగిన అభివృద్ధి గురించి తెలియని వారు చెప్పిన మాటలు విని అవగాహన రాహిత్యంతో ఆయన మాట్లాడుతున్నారని విమర్శించారు. పవన్ గత ఐదేళ్లుగా టీడీపీ, బీజేపీ, సీపీఎం, సీపీఐ, బీఎస్పీలతో జతకడితే లేని తప్పు పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోని టీఆర్ఎస్తో వైఎస్సార్ సీపీ కలసి పనిచేస్తే తప్పేంటని శ్రీనివాస్ ప్రశ్నించారు. తాను 2004లో ప్రజాభిమానంతో ఎమ్మెల్యేగా ఎన్నికై నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, పట్టణ ప్రజల మంచినీటి అవసరాలు తీర్చడానికి 120 ఎకరాల భూమి సేకరించి దానిలో 60 ఎకరాల్లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ఏర్పాటు చేశానన్నారు. పేదల సొంతింటి కల నెలవేర్చడానికి 82 ఎకరాల భూమి సేకరించానని, అంతేకాకుండా 700 మంది పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇచ్చామని చెప్పారు. యనమదుర్రు డ్రైన్‌పై బ్రిడ్జిలు, బైపాస్ రోడ్డు నిర్మించామన్నారు. గత పదేళ్లుగా స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు బైపాస్ రోడ్డు వద్ద రైల్వే గేట్ ఏర్పాటు చేయించలేకపోయారని విమర్శించారు. భీమవరం మండలంలో పేదలకు వెయ్యి ఎకరాల భూమి పంపిణీ చేశామన్నారు. తోపుడు బండ్ల వర్తకులకు హాకర్లజోన్ ఏర్పాటుచేయడమేగాక, భీమవరం నుంచి తరలిపోతున్న కస్తూరిబా మహిళ ప్రభుత్వ కళాశాలను నిలుపుదల చేయడానికి రూ.2 కోట్లు విలువచేసే సొంత ఆస్తిని విరాళంగా ఇచ్చిన విషయాన్ని శ్రీనివాస్ గుర్తు చేశారు. తాను భీమవరం అర్బన్ బ్యాంక్ చైర్మన్‌గా పనిచేసిన రోజుల్లో బ్యాంకును ఎంతో అభివృద్ధి చేసి సుమారు రూ.100 కోట్ల డిపాజిట్లు సేకరించడమేగాక దానిలో రూ.60 కోట్ల వరకు రుణాలుగా ఇచ్చామని చెప్పారు. అయితే దీనిలో అవకతవకలు జరిగాయని పవన్ ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్నేహితుడు కృషిబ్యాంకు వెంకటేశ్వరరావు కారణంగా అప్పట్లో అనేక సహకారం బ్యాంకులు సంక్షోభంలో కూరుకుపోయాయన్నారు. అయినా డిపాజిట్‌దారులకు దాదాపు 98 శాతం తిరిగి తాము చెల్లించామని శ్రీనివాస్ తెలిపారు. తాను డిపాజిట్‌దారులకు అన్యాయంచేసి ఉంటే 2004 ఎన్నికల్లో ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించేవారుకాదని, అలాగే 2014 ఎన్నికల్లో 74 వేల మంది ఓట్లు వేసే అవకాశం లేదని, దీనిని పవన్ గుర్తించాలన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గట్టిపోటీ ఇస్తున్నందున తనపై అసత్య ఆరోపణలు చేయడం పవన్‌కు తగదని శ్రీనివాస్ హితవు పలికారు. -
కనికరం లేని సర్కారు.. కార్మికుల కన్నీరు
సాక్షి, కొవ్వూరు: టీడీపీ సర్కారు కార్మికుల ఉసురుపోసుకుంది. వారి జీవితాలతో దాగుడుమూతలాడింది. చాగల్లు సుగర్ ఫ్యాక్టరీ మూసివేతతో వందలాది కుటుంబాలు రోడ్డున పడినా పట్టించుకోలేదు. జమాన్యానికి కొమ్ముగాస్తూ.. కార్మికుల పొట్టకొట్టింది. తమకు రావాల్సిన బకాయిలైనా ఇప్పించాలని కార్మికులు వేడుకున్నా.. పోరుబాట పట్టినా కనీసం కనికరించలేదు. ఫలితంగా శ్రమజీవుల ఆకలికేకలు మిన్నంటుతున్నాయి. జిల్లాలోనే అత్యధిక చెరకు క్రషింగ్ సామర్థ్యం కలిగిన చాగల్లులోని జైపూర్ చక్కెర కర్మగారం మూతపడడంతో కార్మికులు రోడ్డున పడ్డారు. ఫ్యాక్టరీ మూతపడి 26 నెలలు పూర్తయినా.. జీతాలు, ఇతర రాయితీ బకాయిలు అందక ఆకలి కేకలు పెడుతున్నారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొవ్వూరు నియోజకవర్గంలోనే ఈ దుస్థితి నెలకొన్నా.. టీడీపీ సర్కారు పట్టించుకున్న దాఖలా లేదు. ఇతర పరిశ్రమలూ మూత ఫ్యాక్టరీకి అనుబంధంగా నడుస్తున్న చాగల్లు డిస్టిలరీ, జంగారెడ్డిగూడెంలోని రమా మొలాసిస్ పరిశ్రమలూ మూతపడ్డాయి. ఇదే యాజమాన్యం పోతవరంలో నిర్మించిన మరో చక్కెర కర్మాగారం చెరకు పంట లేకపోవడంతో ట్రయిల్రన్తోనే మూతపడింది. దీంతో సీజన్ కార్మికులతో కలిపి 750 మంది శ్రమజీవులు, ఉద్యోగులు ఉపాధికి దూరమయ్యారు. పోరుబాట పట్టినా ఫలితం శూన్యం ఫ్యాక్టరీ మూతతో దాని ఎదుటే 86 రోజులపాటు కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేశారు. ఫ్యాక్టరీ తెరిపించాలని మంత్రులు, ప్రభుత్వ పెద్దల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. అయినా ఫలితం శూన్యం. దీంతో కుటుంబాలతో రోడ్డెక్కి ర్యాలీలు, ధర్నాలు చేసినా టీడీపీ సర్కారు వారి గోడు పట్టించుకోలేదు. ఆరుగురు కార్మికులు మృతి ఫలితంగా జీతాలందక, కుటుంబాల పోషణ భారమై, ఆర్థిక ఇబ్బందుల బారిన పడి ఏకంగా ఆరుగురు కార్మికులు ప్రాణాలు కొల్పోయారు. ఫీల్డ్మేన్ నల్లూరి శ్రీనివాసరావు, ఫిట్టర్లుగా పనిచేసే ఆలపాటి వెంకటేశ్వరరావు, వీవీఎల్ఎన్ ఆచార్యులు, క్లర్క్‌లు వల్లభనేని సత్యనారాయణ, ఎం.దుర్గారావు ఆరోగ్య సమస్యలతో, మనోవేదనతో మృతి చెందారు. ఆత్కూరి కృష్ణమూర్తి రిటైర్డు అయినా పింఛన్ పొందకుండానే మృతి చెందారు. అసలు కథ ఇదీ.. చాగల్లు ప్యాక్టరీ యాజమాన్యం చెరుకు రైతులకు రూ.70.05 కోట్ల మేర బకాయి పడింది. ఈ బకాయిలు రాబట్టడం కోసం కలెక్టర్ 2016 జనవరి 20న రెవెన్యూ రికవరీ యాక్టు ప్రయోగించి ఫ్యాక్టరీని సీజ్ చేశారు. దీని అనుబంధంగా ఉండే పరిశ్రమలు మూతపడడంతో సీజనల్ కార్మికులతో కలిపి 750 మంది కార్మికులు రోడ్డున పడ్డారు. అమలుకాని హామీ మంత్రి జవహర్ కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో కార్మికులు దీక్షలు విరమించారు. ఇంత వరకు ఒరిగిందేమీ లేదు. జిల్లాకు చెందిన కార్మిక శాఖ మంత్రిని, కార్మిక శాఖ కమిషనర్ని కలిసి గోడు వెళ్లబుచ్చుకున్నా.. సర్కారులో చలనం లేదు. కార్మికులకు జీతాలు, ఇతర అలవెన్స్‌లు అందలేదు. రెండేళ్లు నుంచి కార్మికులు ఉపాధికి దూరమయ్యారు. రిటైర్డు అయిన వాళ్లకు అందాల్సిన సోమ్ములు అందడం లేదు. బతుకు భారమై కార్మికులు విలవిల్లాడుతున్నారు. చైర్మన్‌ను కలిసినా ఫలితమేదీ! కార్మిక సంఘం నాయకులు గత ఏడాది అక్టోబర్ 24న ఫ్యాక్టరీ చైర్మన్‌ని కలిసి తమ గోడు విన్నవించుకున్నారు. నెలలో పీఎఫ్ బకాయిలు జమచేస్తామని, మెడికల్ ప్రీమియం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ అమలు కాలేదు. దీంతో ఈ ఏడాది ఫ్రిబవరి 3న మరోసారి కలిశారు. రాయగఢ్‌లో ఆస్తులను అమ్ముతున్నామని త్వరలో చెల్లిస్తామని హామీ ఇచ్చినా ఇంత వరకు సొమ్ములు అందలేదు. ఇప్పుడు కొత్తగా నేషనల్ కంపెనీస్ లా ట్రిబ్యూనల్ వాళ్లు సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఫ్యాక్టరీని తమ అధీనంలోకి తీసుకున్నామని, ఫ్యాక్టరీని అమ్మి అయినా సరే మూడు నెలల్లో కార్మికులు, ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తామని చెబుతున్నారని, ఇది ఎప్పటికి జరిగేనో అని కార్మిక సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల పరిస్థితి మరింత దైన్యం ఫ్యాక్టరీ మూతతో రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. జిల్లాలో నిడదవోలు, గోపాలపురం, కొవ్వూరు, పోలవరం నియోజకరవర్గాల రైతులు ఈ ఫ్యాక్టరీ పరిధిలోనే చెరుకు సాగు చేసేవారు. మొదట్లో సుమారు 90 వేల ఎకరాల్లో చెరకుపంట సాగయ్యేది. ఫ్యాక్టరీ మూత పడడంతో రైతులు చెరుకుసాగుకు దూరమయ్యారు. బెల్లం తయారు చేసే రైతులు మాత్రమే చెరుకు సాగు చేస్తున్నారు. మూడేళ్ల నుంచి చెరుకుకు ప్రత్యామ్నాయ పంటలు వేసుకుంటున్నారు. ఈ బకాయిల మాటేంటి ? ∙2017 జనవరి 20న ఫ్యాక్టరీ మూతపడడంతో కార్మికులు, ఉద్యోగులకు 26 నెలల నుంచి జీతాలు చెల్లించడం లేదు. ∙2017 జనవరి నుంచి ఇప్పటి వరకు కార్మికులకు యాజమాన్యం పీఎఫ్ బకాయిలు చెల్లించలేదు. ఒక్కో కార్మికుడికి ఏడాదిగా యాజమాన్యం చెల్లించాల్సిన వైద్య ఖర్చులు రూ.10వేలు, బోనస్‌లు, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, ఓవర్ టైమ్(ఓటీ), ఫీల్డ్ సిబ్బందికి ఆదివారం సెలవు దినాల్లో చెల్లించే అలవెన్స్‌లు తదితర పాత బకాయిలు 2014–15 నుంచి చెల్లించడం లేదు. సుమారు రూ.3 కోట్ల మేర ఈ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ∙ఫ్యాక్టరీ నడవని కాలంలో కార్మికులు, ఉద్యోగులకు చెల్లించే రిటర్నింగ్ అలవెన్స్‌లు చెల్లించడం లేదు. ∙2014 మార్చి నుంచి యాజమాన్యం కోటా కింద చెల్లించాల్సి ప్రావిడెంట్ ఫండ్ వాటా చెల్లించడం లేదు. – ఉద్యోగులు, కార్మికుల తరుఫున చెల్లించే ఫీఎఫ్ మాత్రం 2014 మార్చి నుంచి 2016 ఆగస్టు వరకు మాత్రమే చెల్లించారు. దీంతో రిటైర్డు ఉద్యోగులకు పీఎఫ్ రావడం లేదు. ఫ్యాక్టరీ యాజమాన్యం చెల్లించే మొత్తం చెల్లిస్తే తప్ప పీఎఫ్ చెల్లించే వీలులేదు. ∙కార్మికులు, ఉద్యోగులు ఏర్పాటు చేసుకున్న కో–ఆపరేటివ్ క్రిడెట్ సోసైటీ లో ఉన్న నిల్వ లో రూ.90లక్షలు యాజమాన్యం వినియోగించుకుంది. దీంతో కార్మిక సంఘం నాయకులు కో–ఆపరేటివ్ రిజిస్ట్రార్‌కి ఫిర్యాదు చేశారు. నెలకు రూ.10 లక్షలు చొçప్పున 2016 నవంబర్ నుంచి 2017 నవంబర్ వరకు ఆ సొమ్ములు తిరిగి జమ చేస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది. దీనిలో కేవలం రూ.10 లక్షలు జమచేసింది. ఇంకా రూ.80లక్షలు బకాయిలు రావాలి. ∙ఆర్థిక ఇబ్బందులున్న సమయంలో కో–ఆపరేటివ్ సోసైటీ సొమ్మును కార్మికులు, ఉద్యోగులు రుణాలుగా తీసుకునే అవకాశం ఉంది. యాజమాన్యం తీసుకున్న సొమ్ములు జమ చేయకపోవడంతో కార్మికులకు ఆ అవకాశం కుడా లేకుండాపోయింది. మా గోడు పట్టించుకునేవారేరీ వేతనాలు, ఇతర బకాయిలు చెల్లించాలని కోరుతూ 86 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేశాం. మంత్రి కేఎస్ జవహర్ మా సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా ఇంతవరకు ఏమీ చేయలేదు. టీడీపీ ప్రభుత్వం కార్మికుల సమస్యల పరిష్కారంపై శ్రద్ధ చూపలేదు. తక్షణం బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఫ్యాక్టరీ తెరిపించేందుకు చర్యలు తీసుకోవాలి. కో–ఆపరేటివ్ క్రిడెడ్ సోసైటీ నుంచి యాజమాన్యం తీసుకున్న రూ.80లక్షల సొమ్ములు తక్షణం తిరిగి జమచేయాలి. – నీరుకొండ కృష్ణారావు,ది.జైపూర్ సుగర్స్ అండ్ డిస్టిలరీస్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు,చాగల్లు -
నరసాపురం టీడీపీకి రెబల్ బెడద
సాక్షి, నరసాపురం: నరసాపురం తెలుగుదేశం పార్టీలో ‘కొత్త’ చిచ్చు రాజుకుంది. నరసాపురం అసెంబ్లీ స్థానాన్ని సీఎం చంద్రబాబు సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడికి కేటాయించి మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడుకు మొండిచేయి చూపించారు. దీంతో కొత్తపల్లి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఆఖరి నిమిషం వరకూ టికెట్ తనదేనంటూ నమ్మించి వంచించారని ఆరోపించారు. మంగళవారం రుస్తుంబాదలోని ఆయన నివాసంలో తన వర్గీయులతో సమావేశం నిర్వహించారు. కొత్తపల్లి మాట్లాడుతూ ఏడు సార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎంపీగా పోటీ చేసిన తనకు టికెట్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. కచ్చితంగా తాను ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు. ప్రస్తుతానికి పార్టీలోనే కొనసాగుతానని ఎలా పోటీ చేయాలి, దేనికి పోటీ చేయాలి? అనే విషయాలను రెండు రోజుల్లో వెల్లడిస్తానని అన్నారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తన సత్తా ఏంటో చూపిస్తానన్నారు. కొత్తపల్లి పార్టీపై ఎదురు దాడికి దిగడంతో విభేదాలు తారాస్థాయికి చేరాయి. సీటు చిచ్చు టీడీపీలో చీలిక తీసుకురావడంతో తెలుగు తమ్ముళ్లు ఆందోళనలో ఉన్నారు. కొత్తపల్లి వేరే పార్టీలోకి వెళ్లడం అనేది దాదాపుగా ఖరారు అయ్యింది. అయితే అది ఏపార్టీ అనే అంశంలో సందేహాలు నెలకొ న్నాయి. ఇంకోవైపు అన్నీ పార్టీల్లోనూ సీట్లు ఖరారు అయిపోయాయి. దీంతో కొత్తపల్లి వ్యూహం ఏంటనే దానిపై చర్చ జరుగుతోంది. రెబల్‌గా అయినా ఆయన పోటీలో ఉండే అవకాశం కనిపిస్తోంది. భీమవరంలో అసంతృప్తి జ్వాలలు భీమవరం: భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి జ్వాలలు రోజురోజుకూ ఎగసిపడుతున్నాయి. రెండేళ్లుగా ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) వ్యవహార శైలి నచ్చక శ్రేణులు తీవ్ర అసంతృప్తి ఉన్నారు. అయినా ఈసారి ఎన్నికల్లో అంజిబాబుకు సీటు కేటాయించడంతో వలసలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఇది నాయకుల్లో గుబులు రేపుతోంది. వీరవాసరం మండలంలో ఒక నాయకుడిని పక్కన పెడితేనే తాము ఎన్నికల్లో ఉత్సాహంగా పనిచేస్తామని చెప్పినా సోమవారం సమావేశాన్ని ఆ నాయకుడి ఆధ్వర్యంలో ఏర్పాటుచేయడంతో పలువురు సీనియర్ నాయకులు డుమ్మా కొట్టారు. ఇటువంటి సమయంలో భీమవరం నుంచి జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పోటీచేస్తారనే ప్రచారం టీడీపీని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. -
వర్గోన్నతి.. అధోగతి
సాక్షి, కొవ్వూరు: పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడంపై టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. జిల్లాలో నరసాపురం, పాలకొల్లు, భీమవరం, కొవ్వూరు సామాజిక (కమ్యూనిటీ) ఆస్పత్రులను ఏరియా ఆస్పత్రులుగా అప్‌గ్రేడ్ చేస్తూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ఆస్పత్రి భవనాలపై అప్పట్లో బోర్డులు సైతం మార్చారు. కొద్దినెలలకే ఆయన హఠాన్మరణంలో అప్‌గ్రేడేషన్ ప్రక్రియ మరుగున పడింది. ఐదేళ్ల నుంచి చంద్రబాబు సర్కారు దీనిపై శ్రద్ధ చూపలేదు. ఫలితంగా పేదలు ఉచిత వైద్య సేవలకు దూరమవుతున్నారు. రెండు నెలలు క్రితం నరసాపురం, భీమవరం ఆసుపత్రులను అప్‌గ్రేడ్ చేస్తూ ప్ర«భుత్వం జీఓ 44ని జారీ చేసింది. అయితే ఇందుకు అవసరమైన వైద్యులు, సిబ్బంది, మౌలిక సదుపాయాలు, వైద్య పరికరాలను సమకూర్చలేదు. కొవ్వూరు, పాలకొల్లు ఆసుపత్రులు ప్రతిపాదన దశలోనే ఉన్నాయి. కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.5 కోట్లతో ఇటీవల నూతన భవనాల నిర్మాణం చేపట్టారు. అప్‌గ్రేడేషన్ కాకపోవడంలో పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించలేక రిఫరల్ ఆసుపత్రిగా మారింది. దీంతో జిల్లాలోని నాలుగు సామాజిక ఆస్పత్రులను ఏరియా ఆస్పత్రులుగా మార్చాలన్న ప్రతిపాదన కార్యరూపం దాల్చడం లేదు. అప్‌గ్రేడేషన్ చేస్తే ఉన్నత వైద్యం జిల్లాలోని ఆయా నాలుగు ఆస్పత్రుల్లో రోజుకు సుమారు 2 వేల మంది వరకు వైద్య సేవలు పొందుతున్నారు. సామాజిక ఆసుపత్రులను 100 పడకల ఆస్పత్రులుగా అప్‌గ్రేడ్ చేయడం ద్వారా ప్రస్తుతం పనిచేస్తున్న వైద్య సిబ్బంది కంటే రెట్టింపు సిబ్బంది సమకూరే అవకాశం ఉంది. 50 పడకల ఆస్పత్రులకు సివిల్ సర్జన్, డిప్యూటీ సివిల్ సర్జన్ తోపాటు ఐదుగురు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, దంత వైద్యులు, పది మంది స్టాఫ్ నర్సులు, హెడ్ నర్సు ఉంటారు. 100 పడకల ఆస్పత్రులుగా మార్చితే నలుగురు సివిల్ సర్జన్లు, 12 మంది అసిస్టెంట్ సివిల్ సర్జన్లతోపాటు 24 మంది స్టాఫ్ నర్సులు, నలుగురు హెడ్ నర్సుల పోస్టులు రావడంతోపాటు దాదాపు అన్నిరకాల వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి. బెడ్స్ పెరుగుతాయి. వైద్యం.. పూజ్యం ప్రభుత్వాస్పత్రులు అప్‌గ్రేడ్ కాకపోవడంతో రోగులు ప్రైవేట్ ఆస్పత్రుల బాటపడుతున్నారు. నరసాపురం, పాలకొల్లు, భీమవరం ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులు భీమవరంలోని ప్రైవేట్ ఆస్పత్రులను, ఏలూరు జిల్లా ఆస్పత్రిని ఆశ్రయించాల్సి వస్తుంది. అత్యవసర సమయాల్లో వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఉన్నాయి. కొవ్వూరు ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి వస్తున్న రోగులను రాజమండ్రి, కాకినాడ ఆస్పత్రులకు తరలివస్తున్నారు. జిల్లాలో తాడేపల్లిగూడెం, తణుకు, జంగారెడ్డిగూడెంలో ప్రభుత్వ ఏరియా ఆస్పత్రులు, ఏలూరులో జిల్లా ప్రభుత్వాస్పత్రి ఉంది. మరోవైపు ఎన్టీఆర్ వైద్య సేవలో పలు రోగాలకు వైద్యం చేయకపోవడం, సకాలం లో వైద్యానికి అనుమతి రాకపోవడం వంటి సమస్యలు వేధిస్తున్నాయి. వాహనాల నిర్వహణ సరిగా లేక 108 వాహనాలు కూడా పూర్తిస్థాయిలో సేవలందించలేకపోతున్నాయి. కాగితాలకే పరిమితం భీమవరం ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిని ఏరియా ఆసుపత్రిగా మార్చుతూ ప్రభుత్వం జీఓలు జారీ చేసింది. వైద్యులు, వైద్య సిబ్బంది నియామకంపై శ్రద్ధ చూపలేదు. ఆసుపత్రి అప్‌గ్రేడేషన్ కాగితాలకే పరిమితం అయ్యింది. భీమవరం ఆసుపత్రి డెల్టా ప్రాంతంతో పాటు కృష్ణా జిల్లానుంచి రోగులు వస్తుంటారు. వందలాది మంది వైద్యసేవలు పొందుతున్నారు. ఐదేళ్ల నుంచి ప్రభుత్వం అప్‌గ్రేడేషన్ గురించి పట్టించుకోలేదు. ఎన్నికలకు నెలరోజుల ముందు జీఓ జారీ చేసి చేతులు దులుపుకుంది. – కోడే యుగంధర్, భీమవరం -
ఆయ్..ఎవరన్నాఒకటేనండి!
సాక్షి, ఆచంట: ఆయ్.. మాకు ఒకరు ఎక్కువా కాదు.. మరొకరు తక్కువా కాదు.. అన్ని రాజకీయ పార్టీలు సమానమే అంటున్నారు ఆచంట నియోజకవర్గ ఓటర్లు. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకూ 12 సార్లు సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆయా ఎన్నికల్లో కమ్యూనిస్టులు, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను వీరు నాలుగేసి సార్లు గెలిపించి అందరినీ సమానంగా ఆదరించారు. 1962, 1985, 1989, 1994 ఎన్నికల్లో కమ్యూనిస్టులు, 1983, 1999, 2004, 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని, 1967, 1972, 1978, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వీరు గెలిపించి విలక్షణత చాటుకున్నారు. ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఏ పార్టీ గెలుస్తుందనే దానిపై తీవ్ర ఉత్కంఠ ఉంది. పాత సంప్రదాయాన్ని కొనసాగిస్తూ మరో నాలుగు సార్లు వైఎస్సార్ సీపీకి పట్టం కడతారేమో చూడాలి మరి. -
టీడీపీలో ఆగ్రహ జ్వాలలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: చివరి నిమిషం వరకూ నాన్చి నిడదవోలు, నరసాపురం సీట్లు సిట్టింగ్‌లకే కేటాయించడంతో టీడీపీలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాల పట్ల పార్టీలోని అసంతృప్త వర్గం రోడ్డెక్కింది. నరసాపురంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవికి కొత్తపల్లి సుబ్బారాయుడు రాజీనామా చేశారు. కొవ్వూరులో పాయకరావుపేట నుంచి తీసుకువచ్చి వంగలపూడి అనితను రంగంలోకి దింపడంతో ఆగ్రహించిన మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. మరోవైపు చిం తలపూడిలో అభ్యర్థి కర్రా రాజారావు తమను కలుపుకుపోవడం లేదంటూ మాజీ మం త్రి పీతల సుజాత వర్గం సహకరించకూడదని నిర్ణయం తీసుకుంది. పోలవరంలో సిట్టిం గ్ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్‌ను కాదని సీటు కేటాయించిన బొరగం శ్రీనివాస్ అసలు ఎస్టీ కాదంటూ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిడదవోలులో సీటు సిట్టింగ్ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకు కేటాయించడంతో వ్యతిరేక వర్గం నేత కుందుల సత్యనారాయణ అలకబూనారు. ఆయన పార్టీ మారడమా, స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడమా అన్న విషయమై తన అనుచరులతో చర్చలు జరుపుతున్నారు. తెలుగుదేశం పార్టీలో ఈ స్థాయిలో అసంతృప్తి వ్యక్తం అవుతుండటంతో అధిష్టానం తలపట్టుకుంటోంది. నరసాపురం సీటు విషయంలో చివరి వరకు టిక్కెట్ ఇస్తామని ఊరించి మోసం చేశారని కొత్తపల్లి వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం రుస్తుంబాదలోని తన నివాసంలో నిర్వహించిన సమావేశంలో 7 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా పోటీ చేసిన తనకు టికెట్ ఇవ్వకపోవడానికి కారణం ఏమిటో పార్టీ నాయకత్వం చెప్పాలన్నారు. తాను మాత్రం పోటీ చేసి తీరుతానని ఆయన స్పష్టం చేశారు. భీమవరంలో కూడా పార్టీలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. వీరవాసరం మండలంలోని రాయకుదురు గ్రామంలో సోమవారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఒక వర్గం గైర్హాజరుకావడం తీవ్ర చర్చనీయాంశంగా మారిది. అంజిబాబు పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలను పట్టించుకోకుండా చిన్నచూపు చూస్తున్నారని అంతేగాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన అంజిబాబు తన వెంట వచ్చిన నాయకులకే అధిక ప్రాధాన్యత ఇస్తూ నామినేటెట్ పదవులు కట్టబెడుతున్నారని వారు బహిరంగంగానే విమర్శించారు. మరోవైపు కొవ్వూరులో కూడా అసంతృప్తి సెగలు ఇంకా చల్లారలేదు. కొవ్వూరు టిక్కెట్‌కి స్థానికేతరులకు ఇచ్చి తనకు అన్యాయం చేసినందుకు నిరసనగా టీడీపీకీ రాజీనామా చేస్తున్నట్టు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు ప్రకటించారు. మెడలో ఉన్న టీడీపీ కండువాను పక్కన పడవేసి, వేసుకున్న పసుపు రంగు చొక్కా తీసేసి, నల్లగుడ్డ కప్పుకుని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఆయనతో పాటు పలువురు టీడీపీ నాయకులు పార్టీకి రాజీనామా చేశారు. -
స్కూల్లో చెట్టు తొలగింపు.. రోడ్డున వెళ్లే వ్యక్తి మృతి
సాక్షి, పాలకొల్లు: ఎక్కడున్నా మృత్యువు కబళిస్తుందంటారు.. ఎవరో చెట్టు తొలగిస్తుంటే రోడ్డున వెళ్తున్న వ్యక్తిపై అది పడి మృతిచెందాడు. ఎవరూ ఊహించని విధంగా జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని శివదేవుని చిక్కాల గ్రామంలో జెడ్పీ హైస్కూల్ ఉంది. దాని ఆవరణలో ఉన్న ఓ భారీ చెట్టుపై కొందరి కళ్లుపడ్డాయి. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో దాన్ని అనధికారికంగా తొలగించే కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలో స్కూలు ముందునుంచి జాతీయ రహదారిపై వెళ్తున్న రావూరి రాము(24) అనే చిరు వ్యాపారిపై చెట్టు పడింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. వీరవాసరం గ్రామానికి చెందిన రాము పూలపల్లి బైపాస్ రోడ్డులో కూరగాయల వ్యాపారం ముగించుకుని ఇంటికి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. -
మా విషయంలో పవన్ ప్రశ్నిస్తారు
-
రాజమండ్రి ఎందుకు వెళ్లినట్టు?
► తల్లీబిడ్డల మరణంపై అనుమానాలు ► వట్లూరు రైల్వేస్టేషన్ సమీపంలో లభ్యమైన మృతదేహాలు ► మంగళవారం రాత్రే గాయాలతో శిశువు గుర్తింపు ఏలూరు(ఆర్‌ఆర్‌పేట)/ఏలూరు (అర్బన్) : వట్లూరు రైల్వేస్టేషన్ సమీపంలోని పట్టాలపై బుధవారం తల్లీబిడ్డల మృతదేహాలు లభ్యం కావడం కలకలం రేపింది. ఈ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఆత్మహత్యా.. లేక ప్రమాదమా అనేది తెలియరావడం లేదు. ఈ దుర్ఘటన మంగళవారం రాత్రే జరినట్టు అధికారులు చెబుతున్నారు. రైల్వేపోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. టి.నర్సాపురం మండలం జగ్గవరం గ్రామానికి చెందిన దొండపాటి ప్రభావతి(30) తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవడంతో మేనమామ కొమ్ముకూరి ప్రసాద్ వద్ద పెరిగింది. ఈమెకు ఆరేళ్ల కిందట లింగంపాలెం మండలం బాదరాల గ్రామానికి చెందిన దొండపాటి కోటేశ్వరరావుతో వివాహమైంది. వీరికి ఐదేళ్ల కుమార్తె మహాలక్ష్మి, పదినెలల కుమారుడు మహీధర్ ఉన్నారు. కోటేశ్వరరావు కూలి పనులు చేస్తూ ఉంటాడు. కొంతకాలంగా కోటేశ్వరరావు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యబిడ్డలను పట్టించుకోవడం మానేశాడు. దీనిపై ప్రభావతి, కోటేశ్వరరావు మధ్య తరుచూ గొడవలు జరిగేవి. గతంలో రెండుసార్లు తన బతుకు తాను బతుకుతానని ప్రభావతి పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఇరుపక్షాల పెద్దలు జోక్యం చేసుకుని కోటేశ్వరరావు సక్రమంగానే ఉంటాడని నచ్చజెప్పి ప్రభావతిని కాపురానికి పంపారు. అయినా కోటేశ్వరరావు ప్రవర్తనలో మార్పురాలేదు. ఈ నేపథ్యంలో రెండురోజుల కిందట కొడుకు మహీధర్‌కు జ్వరం రావడంతో ప్రభావతి పెద్ద డాక్టర్‌కు చూపించాలని భర్తను కోరింది. ఈ విషయం అతను పట్టించుకోకపోవడంతో ప్రభావతి మంగళవారం తన ఇద్దరు బిడ్డలను తీసుకుని ఏలూరు ఆస్పత్రికి వెళ్తున్నానని ఇరుగుపొరుగు వారికి చెప్పి బాదరాల నుంచి బయలుదేరింది. ఆమె నేరుగా రాజమండ్రి వెళ్లి, అక్కడి నుంచి మళ్లీ ఏలూరు వచ్చేందుకు టికెట్ తీసుకుని రైలు ఎక్కింది. ఏలూరులో ఆమె రైలు దిగలేదు. పవర్‌పేట స్టేషన్ దాటిన తరువాత వ ట్లూరు పమీపంలో ఆమె కొడుకు మహీధర్ రైలు నుంచి పడిపోయాడు. ఆ తరువాత ప్రభావతి ఆమె కూతురు మహాలక్ష్మి కూడా రైలు నుంచి పడిపోయారు. ప్రభావతి రైలు చక్రాల కిందపడి నుజ్జునుజ్జుకాగా.. కూతురు మహాలక్ష్మి తీవ్రగాయాలతో మరణించింది. ఈ నేపథ్యంలో ఏలూరు రైల్వే పోలీసులకు మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో నెలల శిశువు రైలు పట్టాలపై గాయాల తో పడి ఉన్నాడని సమాచారం అందడంతో వారు శిశువును ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే బుధవారం శిశువు దొరికిన ప్రాంతానికి కొద్దిదూరంలో మహిళ, ఐదేళ్ల బాలిక మృతదేహాలు పడి ఉన్నాయని రైల్వే పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని వాటిని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రాత్రి దొరికిన శిశువుకు, ఈ మృతదేహాలకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో వారు విచారణ చేపట్టడంతో మృతులు బాదరాలకు చెంది న తల్లీకూతుళ్లుగా గుర్తించారు. దుర్ఘటనపై వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బంధువులు, ప్రభావతి భర్త కోటేశ్వర రావు ఏలూరు ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు ప్రభావతి, ఆమె కుమార్తె మహాలక్ష్మి మృతదేహాలు లభించిన తీరు, ఆమె కుమారుడు గాయాలతో పడి ఉండడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేసినట్లు ఏలూరు రైల్వే ఎస్ఐ నాయుడు రాము విలేకరులకు తెలిపారు. కేసును పూర్తి స్థాయిలో విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. బాదరాలలో విషాదఛాయలు లింగపాలెం : తల్లీబిడ్డల మృతితో బాదరాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనతో గ్రామస్తులు ఒక్కసారిగా ఖిన్నులయ్యారు. అందరితో కలుపుగోలుగా ఉండే ప్రభావతి మరణించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న పదినెలల మహీధర్ తల్లిపాల కోసం రోదిస్తున్న తీరు కంటతడి పెట్టిస్తోంది. భర్త వేధింపులే కారణం ప్రభావతి మేనమామ ప్రసాద్ ఆరోపణ ప్రభావతి భర్త వేధింపులు తాళలేకే ఆత్మహత్య చేసుకుని ఉంటుందని ఆమె మేనమామ కొమ్ముకూరి ప్రసాద్ రోదిస్తున్నారు. ప్రభావతి మృతివార్త టీవీల ద్వారా తెలుసుకున్న ఆయన ఏలూరు ప్రభుత్వాస్పత్రికి వచ్చారు. మేనకోడలి మృతదేహాన్ని చూసి కుప్పకూలిపోయాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభావతిని కన్న కూతరి కంటే ఎక్కువగా చూసుకున్నానని, ఆమె ఇలా విగతజీవిగా మారడం తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. భర్త వేధింపులే తన మేనకోడలి చావుకు కారణమని ఆరోపించారు. ఆమె భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని చెప్పారు. ప్రభావతి ఈ విషయం తనకు ఎన్నోసార్లు చెప్పిందని, అతనిలో మార్పు వస్తుందని సర్దిచెప్పి పంపానని రోదించారు. కోటేశ్వరరావును కఠినంగా శిక్షించాలని డిమాండ్‌చేశారు. సమాధానం దొరకని ప్రశ్నలెన్నో! ఈ దుర్ఘటన వెనుక కారణాలు అంతుబట్టడం లేదు. ప్రభావతి బిడ్డలతో సహా ఆత్మహత్యకు యత్నించిందా? లేక ప్రమాదవశాత్తూ ముగ్గురూ రైలులో నుంచి పడిపోయారా?తొలుత శిశువు పడిపోవడంతో మిగిలిన ఇద్దరూ దూకేశారా? లేక ఎవరైనా తోసేశారా? అన్నది అంతుచిక్కడం లేదు. మృతురాలి వద్ద లభించిన టికెట్ ఆధారంగా ఆమె రాజమండ్రి నుంచి ఏలూరుకు వస్తున్నట్టు తెలిసింది. అసలు ఏలూరు ఆస్పత్రికి వెళ్తున్నానని చెప్పిన ప్రభావతి రాజమండ్రి ఎందుకు వెళ్లినట్టు? అక్కడి నుంచి మళ్లీ ఏలూరు ఎందుకు వచ్చినట్టు అనే ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. దీనిపై ఆమె భర్త, కుటుంబసభ్యులను ప్రశ్నిస్తే తెలీదనే సమాధానమే వస్తోంది. రాజమండ్రిలో తమకు బంధువులు గానీ, స్నేహితులుగానీ లేరని చెబుతున్నారు. ఏలూరుకు టికెట్ తీసుకున్న మృతురాలు ఏలూరులో ఎందుకు దిగలేదు? వట్లూరు వరకూ ఎందుకు వెళ్లిం ది? అనేది కూడా అంతుబట్టడం లేదు. ప్రభావతి ఆత్మహత్య చే సుకోవాలనుకుంటే రాజమండ్రి ఎందుకు వె ళ్లినట్టు? వట్లూరు సమీపంలోనే ఎందుకు ఆత్మహత్య చేసుకున్నట్టు అనేది అనుమానాస్పదంగా మారింది. ఒకవేళ ఎవరికీ తెలియని చోటుకు ప్రభావతి వెళ్లిపోదామనుకుందా? ఈ క్రమంలో బాబు ప్రమాదవశాత్తూ జారి పడడంతో ఆమె, బాలిక దూకేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.