ఆయ్‌..ఎవరన్నాఒకటేనండి! | Achanta Voters Give Equal Results To All Parties | Sakshi
Sakshi News home page

ఆయ్‌..ఎవరన్నాఒకటేనండి!

Published Wed, Mar 20 2019 7:57 AM | Last Updated on Wed, Mar 20 2019 7:59 AM

Achanta Voters Give Equal Results To All Parties - Sakshi

సాక్షి, ఆచంట: ఆయ్‌.. మాకు ఒకరు ఎక్కువా కాదు.. మరొకరు తక్కువా కాదు.. అన్ని రాజకీయ పార్టీలు సమానమే అంటున్నారు ఆచంట నియోజకవర్గ ఓటర్లు. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకూ 12 సార్లు సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆయా ఎన్నికల్లో కమ్యూనిస్టులు, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను వీరు నాలుగేసి సార్లు గెలిపించి అందరినీ సమానంగా ఆదరించారు. 1962, 1985, 1989, 1994 ఎన్నికల్లో కమ్యూనిస్టులు, 1983, 1999, 2004, 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని, 1967, 1972, 1978, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు వీరు గెలిపించి విలక్షణత చాటుకున్నారు. ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఏ పార్టీ గెలుస్తుందనే దానిపై తీవ్ర ఉత్కంఠ ఉంది. పాత సంప్రదాయాన్ని కొనసాగిస్తూ మరో నాలుగు సార్లు వైఎస్సార్‌ సీపీకి పట్టం కడతారేమో చూడాలి మరి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement