cut down
-
ఇక తిరుమలలో ఆ చెట్లు కనిపించవు!
తిరుమల: శేషాచలం కొండల్లో దట్టంగా విస్తరించిన ఆస్ట్రేలియా సంతతికి చెందిన అకేషియా చెట్లను తొలగించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ణయించింది. గతంలో వేగంగా పెరుగుతాయని ఈ చెట్లను నాటిన టీటీడీ ఇప్పుడు వీటి వల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బతింటోందన్న బయోడైవర్సిటీ బోర్డు సూచనల మేరకు వీటిని తొలగించనుంది. శేషాచలం కొండల్లో టీటీడీ పరిధిలో 3 వేల హెక్టార్ల అటవీ స్థలం ఉండగా 800 హెక్టార్లలో అకేషియా చెట్లు ఉన్నాయి. వీటిని అంచెలవారీగా తొలగించి.. వాటి స్థానంలో సంప్రదాయ చెట్లను నాటాలని టీటీడీ భావిస్తోంది. 1,000 ఎకరాల్లో శ్రీగంధం చెట్లు గతానికి భిన్నంగా ప్లాంటేషన్ విధానంలో గత ఐదేళ్ల నుంచి టీటీడీ మార్పులు తెస్తోంది. శ్రీవారి కైంకర్యానికి వినియోగించేందుకు అనువుగా ఉంటాయని ఇప్పటికే పార్వేటి మండపానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో 1,000 ఎకరాల్లో విడతల వారీగా శ్రీగంధం చెట్లను నాటింది. మరో 25 ఎకరాల స్థలంలో వివిధ రకాల సంప్రదాయ చెట్లను పెంచుతోంది. వీటిలో ఉసిరి, మామిడి, అరటి, జమ్మి, మారేడు, సపోటా, సీతాఫలం, రామఫలం, లక్ష్మణఫలం, కదంబ, పనస, పొగడ, మనోరంజితం, రుద్రాక్ష వంటివి ఉన్నాయి. ఇక శ్రీవారి మూలమూర్తికి పుష్ప కైంకర్యం కోసం ఐదెకరాల్లో పూల చెట్లను పెంచుతోంది. ఇప్పుడు పర్యావరణ సమతుల్యం దెబ్బతీస్తోన్న అకేషియా చెట్లను తొలగించి.. వాటి స్థానంలో పురాణాల్లో విశేషంగా వర్ణించిన చెట్లను పెంచాలని ఆలోచన చేస్తోంది. ఇందుకోసం పది నుంచి పదిహేను రకాల మొక్కలను ఎంపిక చేసింది. ఇప్పటికే ఘాట్ రోడ్డుల్లో టీటీడీ పెంచిన పలు పూల చెట్లు ప్రయాణికులు, యాత్రికులను ఆహ్లాదపరుస్తున్నాయి. వేగంగా విస్తరించిన.. ‘అకేషియా’ 1990లో వేగంగా పెరుగుతాయని 2 వేల ఎకరాల విస్తీర్ణంలో టీటీడీ అటవీ సిబ్బంది అకేషియా చెట్లను నాటారు. ఊహించినట్టుగానే ఇవి శేషాచలం కొండల్లో బాగా విస్తరించాయి. ఇప్పుడు ఇదే టీటీడీకి సమస్యగా మారింది. అకేషియా చెట్ల వల్ల జీవవైవిధ్యంలో మార్పు రావడంతోపాటు చెట్ల కింద భూసాంద్రత దెబ్బతింటోందని బయోడైవర్సిటీ బోర్డు పరిశోధనలో తేలింది. ఆ చెట్ల కింద పీహెచ్ వాల్యూ 4.5 శాతానికి పడిపోయిందని.. భూమిలో ఆమ్లాల శాతం కూడా ఎక్కువగా ఉందని వెల్లడైంది. ఈ మేరకు బయోడైవర్సిటీ బోర్డు టీటీడీకి నివేదిక సమర్పించింది. సుమారు రెండు వేల ఎకరాల్లో ఉన్న చెట్లను నరికివేయడం ఇష్టం లేకపోయినా.. వాటి వల్ల జీవవైవిధ్యానికి కలుగుతున్న నష్టాన్ని గ్రహించి విడతలవారీగా వాటిని తొలగించాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. -
స్కూల్లో చెట్టు తొలగింపు.. రోడ్డున వెళ్లే వ్యక్తి మృతి
సాక్షి, పాలకొల్లు: ఎక్కడున్నా మృత్యువు కబళిస్తుందంటారు.. ఎవరో చెట్టు తొలగిస్తుంటే రోడ్డున వెళ్తున్న వ్యక్తిపై అది పడి మృతిచెందాడు. ఎవరూ ఊహించని విధంగా జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని శివదేవుని చిక్కాల గ్రామంలో జెడ్పీ హైస్కూల్ ఉంది. దాని ఆవరణలో ఉన్న ఓ భారీ చెట్టుపై కొందరి కళ్లుపడ్డాయి. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో దాన్ని అనధికారికంగా తొలగించే కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలో స్కూలు ముందునుంచి జాతీయ రహదారిపై వెళ్తున్న రావూరి రాము(24) అనే చిరు వ్యాపారిపై చెట్టు పడింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. వీరవాసరం గ్రామానికి చెందిన రాము పూలపల్లి బైపాస్ రోడ్డులో కూరగాయల వ్యాపారం ముగించుకుని ఇంటికి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. -
దౌర్జన్యంగా పొలంలో తాటిచెట్లు తొలగింపు
-
100 ఎంబీబీఎస్ సీట్లకు ఎంసీఐ కోత
-
బ్రాహ్మచారులు మద్యం మానాలంటే.. ఇదిగో చిట్కా!
న్యూయార్క్: కలిసి ఉంటే కలదు సుఖమని పెద్దలు చెప్పింది నిజమే అని సైన్స్ కూడా చెబుతోంది. వ్యక్తుల ప్రవర్తనలపై జరిపిన అధ్యయనాల్లో ఒంటరిగా ఉండేవాళ్లకంటే జతగా ఉన్నవాళ్లే ఎక్కువ సంతోషంగా ఉంటున్నారట. మరీ ముఖ్యంగా మద్యం తాగే అలవాటు కూడా ఒంటరిగా ఉండేవాళ్లకంటే మరొకరితో కలిసుండే వారికే తక్కువగా ఉంటుందట. ఒక వేళ ఎవరైతే ఒంటరిగా ఉండి విపరీతమైన తాగుడుకు బానిసలుగా ఉంటారో వారు ఆ అలవాటు నుంచి బయటపడేందుకు వెంటనే ఎవరితోనైనా స్నేహం చేయడమో.. లేకపోతే పెళ్లి చేసుకొని జీవిత భాగస్వామిని ఆహ్వానించడమో చేస్తే మంచిదని సూచిస్తున్నారు. వర్జీనియాలోనో ఓ విశ్వవిద్యాలయానికి చెందిన డియానా డినెస్కు అనే రచయిత ఈ విషయంపై వివరణ ఇస్తూ .. 'ఒంటరిగా ఉండటంకన్నా మరొకరితో కలిసి ఉండటం మేలు. దాని ద్వారా మద్యం అలవాటును తగ్గించుకోవచ్చు. మేం చేసిన అధ్యయనంలో ఎవరైతే వివాహం చేసుకున్నారో వారికి మద్యం తాగే అలవాటు బాగా తక్కువగా ఉంది. అదే ఒంటరిగా ఉండే వాళ్లు ఇష్టం వచ్చినంత ఘాటుమందు తాగుతారని తెలిసింది' అని ఆయన చెప్పారు. ఇద్దరు కవలలను తమ అధ్యయనానికి తీసుకున్నట్లు చెప్పారు. ఆ కవలల్లో ఒకరు ఒంటరివారు కాగా.. మరొకరు వివాహం అయిన వాళ్లు. దీంతోపాటు ఓ వెయ్యి జంటలపై కూడా ఒంటరివారి ప్రవర్తనలు, అలవాట్లపై అధ్యయనం చేసినట్లు ఆయన వెల్లడించారు. -
అరటి చెట్లను నరికేసిన దుండగులు
అనంతపురం: సీమలో ఫ్యాక్షన్ మరోసారి పడగ విప్పింది. అనంతపురం జిల్లాలో దుండగులు పెద్ద ఎత్తున అరటి చెట్లను నరికిన ఘటన చోటుచేసుకుంది. పుట్లూరు మండలం రంగరాజు కుంటలో ప్రభాకర్ పొలంలో సోమవారం అర్ధరాత్రి 500 అరటి చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికేశారు. మంగళవారం ఉదయం తన తోటలోని అరటిచెట్లు నేలకొరగడాన్ని చూసిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పెట్రోలు ధరలు తగ్గే అవకాశం ఉందన్న మొయిలీ
చమురు ధరలు తగ్గే అవకాశం ఉందని కేంద్ర చమురుశాఖ మంత్రి వీరప్ప మొయిలీ చెప్పారు. అయితే ఎప్పుడు, ఎంత తగ్గుతాయన్న విషయం మాత్రం ఆయన చెప్పలేదు. సామాన్యుడికి ఊరట తప్పనిసరిగా ఉంటుంది గానీ, అది ఎప్పుడు.. ఎంత అని మాత్రం అడగొద్దని మొయిలీ విలేకరులతో అన్నారు. ఎప్పుడో చెబితే ప్రజలు నిల్వ చేసుకుంటారని అన్నారు. మరో రెండు నెలల్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రజలకు మొయిలీ ప్రకటన పెద్ద ఊరటగానే మిగలనుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గడంతో ఈ ఊరట లభించేలా ఉంది. ఇరాక్, వెనిజులా లాంటి దేశాల నుంచి కూడా ముడి చమురు కొనుగోలు చేసే అవకాశం ఉండటంతో ధరలు తగ్గుతున్నట్లు మొయిలీ చెప్పారు.