అనంతపురం: సీమలో ఫ్యాక్షన్ మరోసారి పడగ విప్పింది. అనంతపురం జిల్లాలో దుండగులు పెద్ద ఎత్తున అరటి చెట్లను నరికిన ఘటన చోటుచేసుకుంది.
పుట్లూరు మండలం రంగరాజు కుంటలో ప్రభాకర్ పొలంలో సోమవారం అర్ధరాత్రి 500 అరటి చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికేశారు. మంగళవారం ఉదయం తన తోటలోని అరటిచెట్లు నేలకొరగడాన్ని చూసిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.