ఇంట్లో పేలుడు.. వ్యక్తి మృతి, ముగ్గురికి గాయాలు | one person died in jelitin sticks blast which were stacked at home | Sakshi
Sakshi News home page

ఇంట్లో పేలుడు.. వ్యక్తి మృతి, ముగ్గురికి గాయాలు

Published Wed, Apr 29 2015 9:46 PM | Last Updated on Sun, Sep 3 2017 1:07 AM

one person died in jelitin sticks blast which were stacked at home

ఇంట్లో నిల్వ ఉంచిన జిలిటిన్ స్టిక్స్, డిటోనేటర్లు పేలడంతో ఒక వ్యక్తి మృతి చెందగా అతని కుటుంబ సభ్యులు ముగ్గురికి గాయాలయ్యాయి. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం మామిళ్లవాడ గ్రామంలో బుధవారం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన ఎండీ. మతీన్ అనే వ్యక్తి తన ఇంటిలో పేలుడు పదార్ధాలైన జిలిటిన్ స్టిక్స్, డిటోనేటర్లను నిల్వ చేశాడు. ప్రమాదవశాత్తు పేలడంతో మతీన్ అక్కడికక్కడే మృతి చెందాడు.

 

ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న రసూల్, నీలిమ, మరొక చిన్నారి గాయపడినట్లు సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు  మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. అయితే భారీ పేలుడు పదార్థాలు ఇంట్లో ఎందుకున్నాయి? వీటిని అక్రమంగా నిలిపి ఉంచారా? అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement