క్షణక్షణం.. భయం భయం | RTC bus crush 28 people injured | Sakshi
Sakshi News home page

క్షణక్షణం.. భయం భయం

Published Sun, Dec 29 2013 4:37 AM | Last Updated on Sat, Sep 2 2017 2:04 AM

RTC bus crush 28 people injured

జిల్లాలో  శనివారం రోడ్లు రక్తసిక్తమయ్యాయి. అతివేగం.. మంచుతెర రూపంలో మృత్యువు వెంటాడింది. కావలి సమీపంలో ఓ బొలెరో వాగులో బోల్తాపడింది. ఇద్దరు మృత్యువాతపడగా, ఆరుగురు గాయాలతో బయటపడ్డారు. మర్రిపాడు సమీపంలో  రోడ్డుపై ఆగి ఉన్న లారీని   ఆర్టీసీ బస్సు ఢీకొంది.  28 మంది తీవ్రంగా గాయపడ్డారు. జలదంకి సమీపంలో  బైకును ట్రాక్టర్ ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందాడు. నెల్లూరులో రోడ్డు దాటుతున్న  ఆటో డ్రైవర్‌ను  కారు ఢీకొనడంతో  మృతి చెందాడు.
 
 ఏ క్షణానికి ఏ దుర్వార్త వినాల్సి వస్తుందో..ఎప్పుడు ఏవైపు నుంచి దొంగలు తెగబడతారో.. రోడ్డు ప్రమాద రూపంలో మృత్యు వు ఎప్పుడు ఎవరిని, ఎంతమందిని కబళిస్తోందో..ఇలా క్షణక్షణం..భయం భయంగా 2013లో సింహపురి ప్రజలు గడిపారు. క్షణికావేశం, అల్పసంపాదన, వివాహేతర సంబంధాలు, మద్యంమత్తు, అనుమానాలు, పాతకక్షలు..ఇలా కారణమేదైతేనేం ఇప్పటి వరకు 85 ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. బిడ్డలను కనురెప్పలా కాపాడాల్సిన తల్లిదండ్రులే వారిపై దారుణాలకు తెగబడ్డారు. ఈజీమనీకి అలవాటు పడిన పలువురు చైన్ స్నాచింగ్‌లతో చెలరేగిపోయారు. వీలుకాని చోట ప్రాణాలు తీసేం దుకు కూడా వెనుకాడలేదు. మొత్తం మీద ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు నిఘా వ్యవస్థ వైఫల్యంతో జిల్లాలో పలు దారుణాలు చోటుచేసుకున్నాయి. గతేడాదితో పోలిస్తే నేరాల సంఖ్య గణనీయంగా పెరిగింది.  - న్యూస్‌లైన్, నెల్లూరు(క్రైమ్)
 
  ఎల్లలుదాటిన ఎర్రచందనం
 జిల్లాలోని వెలుగొండ అడవుల్లో అరుదుగా లభించే ఎర్రచందనం ఈ ఏడాది భారీగా ఎల్లలు దాటింది. అడపాదడపా పోలీసులు, అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నా దొరకని దుంగలే ఎక్కువ. గతంలో ఎన్నడూ లేనివిధంగా తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు, కూలీలు జిల్లాలోకి ప్రవేశించారు. వీరిలో సుమారు 120 మందిని వరకు అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో పట్టుబడిన సుమారు 250 మందిని నెల్లూరు జైలుకు తరలించారు.
 
 మహిళలపై దారుణాలు
 మహిళలపై జరిగిన దారుణాలకు సంబంధించి జిల్లాలో ఈ ఏడాది 800 కేసుల వరకు నమోదయ్యాయి. వీటిలో వరకట్న హత్యలు ఏడు, ఆత్మహత్యలు 33, వేధింపులు 129, హత్యలు 35, వరకట్న వేధింపులు 187, కిడ్నాప్ కేసులు 55 ఉన్నాయి.
 
 ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే భక్షకులయ్యారు. అక్రమాలకు పాల్పడుతూ కొంద రు, దొంగలకు సహకరించి మరికొందరు, మద్యం మత్తులో జోగుతూ ఇంకొందరు పోలీసుశాఖ ప్రతిష్టను మంటగలిపారు. లంచం తీసుకుంటూ ఓజిలి ఎస్సై కలికి జనార్దన్‌రెడ్డి ఏసీబీకి పట్టుబడ్డారు. కార్మికశాఖ అధికారులతో అనుచితంగా వ్యవహరించడానే ఆరోపణపై గూడూరు రూరల్ సీఐ వేమారెడ్డిపై ఉన్నతాధికారులు కేసు నమోదురు. అకారణంగా ఓ వ్యక్తిని కొట్టాడని ఆత్మకూరు ఎస్సైపై కేసు నమోదైంది.
 
 ఓ యువతిని లైంగికంగా వేధించడంతో కావలిలో ఎక్సైజ్ కానిస్టేబుల్ బ్రహ్మానందకుమార్ పోలీసు రికార్డుల్లోకి ఎక్కారు. కలువాయిలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. దొంగలకు సహకరించారని బిట్రగుంట పోలీసుస్టేషన్లో హెడ్‌కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లను విధులనుంచి తొలగించారు. జాతీయరహదారిపై వసూళ్లకు పాల్పడుతున్నారంటూ గూడూరు సబ్‌డివిజన్ పరిధిలో నలుగురు సిబ్బందిని, పేకాటాడుతూ దొరికిన వారిని కూడా విధులనుంచి తొలగించారు. ఏఆర్ డీఎస్పీ శివారెడ్డి వేధిస్తున్నాడని ఆయన భార్య విజయశ్రీ ఫిర్యాదు చేయడం పోలీసుశాఖలో చర్చనీయాంశంగా మారింది.
 
 దిగజారిన మానవీయ విలువలు
 ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతున్నా అదే స్థాయిలో మాన వ సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఈ ఏడాదిలో జిల్లాలో చోటుచేసుకున్న పలు సంఘటనలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
 ఏప్రిల్ 26న నెల్లూరులోని మైపాడుగేటు శ్రీనివాసనగర్‌లో దుద్దుగుంట రాధను భర్తే హత్య చేశాడు.
 జూన్ 5న నెల్లూరు రామ్మూర్తినగర్‌లోని పినాకిని అపార్టుమెంట్‌లో శివప్రసాద్‌ను భార్య, అత్తే దారుణంగా హత్య చేశారు.
 జూన్ 10న పడారుపల్లి ఆటోనగర్ కాలనీలో సులోచన హత్యకు గురైంది. ఈ కేసులో ఆమె సోదరుడే నేరారోపణ ఎదుర్కొంటున్నాడు.
 జూలై 3న నెల్లూరు జాకీర్‌హుస్సేన్‌నగర్‌లో ఇల్లు ఖాళీ చేయమన్నందుకు సుప్రజ అనే మహిళను ఉమాదేవి చంపేసింది.
 ఆగస్టు 30న కోవూరు మండలం వేగూరులో సంపూర్ణమ్మ భర్త చేతిలో హత్యకు గురైంది.
 సెప్టెంబర్ 2న ఆత్మకూరులో తల్లి అడివెమ్మను కుమారుడే హతమార్చాడు.
 సెప్టెంబర్ 4న నెల్లూరు వెంకటేశ్వరపురంలో సుధాకర్‌ను భార్య సావిత్రి హత్యచేసింది.
 అక్టోబర్ 3న కావలిలో చిన్నారి ఐశ్వర్యను ఆమె తల్లే అంతమొందించింది.
 పొదలకూరులో కూతురినే నిర్బంధించి లైంగికదాడి చేసిన తండ్రి ఉదంతం, జలదంకి మండలంలో పద్మ అనే మహిళను భర్త హతమార్చడం, సూళ్లూరుపేటలో కుటుంబసభ్యులే ఇంటి యజమానికి హత్య చేసిన సంఘటన లు నవంబర్‌లో చోటుచేసుకున్నాయి.
 డిసెంబర్ 10న నెల్లూరులో ఆస్తి కోసం తోడబుట్టిన సోదరి కుటుంబాన్నే అంతమొందించేందుకు ఓ మహిళ ప్రయత్నించింది.
 డిసెంబర్ 14న నెల్లూరు రూరల్ మండలం మాదరాజుగూడూరులో తండ్రి కమతం నరసయ్యను కుమారుడు హత్య చేశాడు. అదే రోజు సంగం మండలం జెండాదిబ్బలో హారికను భర్త హరికృష్ణ చంపేశాడు.
 
 సంచలన హత్యలు
 జిల్లాలో ఈ ఏడాది చోటుచేసుకున్న పలు హత్యాఘటనలు ప్రజలను ఉలిక్కిపాటుకు గురిచేశాయి. వాటిలో కొన్ని ప్రధాన ఘటనలు ఇవి.
 
  జనవరి 31న బుచ్చిరెడ్డిపాళెంనకు చెందిన అంధ విద్యార్థి శశాంక్‌ను కొందరు దుండగులు నగదు కోసం కిడ్నాప్ చేసి, హతమార్చి నెల్లూరు మూలాపేటలో పోలీసుక్వార్టర్స్ సమీపంలోని బావిలో పడేశారు.
  ఫిబ్రవరి 9వ తేదీ అర్ధరాత్రి దుత్తలూరు మండలం సోమలరేగడలో ఇంటి యజమానే కుటుంబంలోని నలుగురిని హతమార్చాడు.
  ఫిబ్రవరి 12న నెల్లూరులోని హరనాథపురంలో ముగ్గురు యువకులు నగదు కోసం తల్లీకూతురిని దారుణంగా చంపేశారు.
  ఏప్రిల్ 10న జలదంకి మండలం జమ్మలపాళెంకు చెందిన కొండారెడ్డి కోర్టుకు హాజరయ్యేందుకు కావలికి బైక్‌పై బయలుదేరగా బుడమగుంట వద్ద ప్రత్యర్థులు వేటకొడవళ్లతో నరికి హతమార్చారు.
  జూలై 4న మాజీ మావోయిస్టు నేత గంటి ప్రసాదంను నెల్లూరులోని అరవింద్‌నగర్‌లో పట్టపగలే కాల్చిచంపారు.
 సెప్టెంబర్ 11న తడ మండలం బోడిలింగాలపాడులో దంపతులను పక్కింటి వ్యక్తే దారుణంగా చంపేశాడు.
 అక్టోబర్ 13న వెంకటాచలం మండలం కాకుటూరులోని చింతాలమ్మ ఆలయ వాచ్‌మన్ సుబ్బరామయ్యను గుర్తుతెలియని వ్యక్తులు కిరాతకంగా చంపారు.
 
 ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
 28 మందికి గాయాలు
 
 మర్రిపాడు/ఆత్మకూరు/ఆత్మకూరురూరల్, న్యూస్‌లైన్ :  ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటన మండలంలోని నెల్లూరు-ముంబాయి రహదారిపై మరియవరం సమీ పం వద్ద  శనివారం జరిగింది. ఈ ప్రమాదంలో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరియవరం సమీపంలో ఓ లారీ పంక్చర్ అయి రోడ్డు పై ఆగి ఉంది.
 
 ఉదయం మంచు తీవ్రత కారణంగా రోడ్డు సక్రమంగా కనిపించకపోవడంతో చాబోలు నుంచి ఆత్మకూరుకు వస్తున్న ఉదయగిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి లారీని వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ షంషీద్‌తో పాటు ప్రయాణికులు సులోచనమ్మ, సుభాన్, వెంగమ్మ, అబ్దుల్లా, ర మణయ్య, సంజీవరాజు, వెంకట రమణయ్య, కొండమ్మ, సునీత, శ్రీనివాసులు తదితరులు గాయపడ్డారు.  క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆత్మకూరు, ఉదయగిరి 108 వాహనాల సిబ్బం ది ఆత్మకూరుకు తరలించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్, సులోచనమ్మతో పాటు మరో ఐదుగురిని మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించినట్లు ఆత్మకూరు వైద్యాధికారి మాల్యాద్రి తెలిపారు. ప్రమాద విషయం తెలుసుకున్న మర్రిపాడు ఎస్సై రవినాయక్ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 బాధితులకు ఆర్టీసీ ఆదరణ కరువు
 బస్సు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుల ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రి వద్ద బాధితులకు ఆత్మకూరు డిపోకి చెందిన సిబ్బంది, అధికారుల ఆదరణ క రువైంది. ఎక్కడైనా ఆర్టీసీ బస్సు ప్రమాదం జరిగితే సమీప డిపోకి చెందిన మేనేజరు లేదా కిందిస్థాయి అధికారి సంఘటన స్థలాన్ని పరిశీ లించి బాధితులకు మెరుగైన వైద్య సేవలకు అవసరమైన సదుపాయాలు సమకూర్చాలి. అయితే శనివారం ఆసుపత్రి వద్ద బాధితులను పట్టించున్న ఆర్టీసీ అధికారులు కరువయ్యారు.
 
  ఆత్మకూరు ఆర్టీసీ డీఎం సెలవులో ఉన్నారు. దీంతో సమీపంలోని ఉదయగిరి డిపో మేనేజర్ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఆయన అందుబాటులో లేరు కాబట్టి మేనేజర్ కిందిస్థాయి అధికారి ఎస్టీఐ అన్నీ బాధ్యతలు చూసుకోవాలి. అయితే ఎస్టీఐ డిపో ప్రధాన కేంద్రంలో ఉం డరు. పొరుగూరు నుంచి ఆయన రాకపోకలు సాగిస్తుంటారు. ప్రమాదం ఎప్పుడో తెల్లవారుజామున జరిగినా ఉదయం 10 గంటల వరకు ఆయన ఆసుపత్రి వద్ద కనిపించలేదు. క్షతగాత్రులను స్వగ్రామాలకు పంపించే ఏర్పాట్లు చేయలేదు. కొంతమందిని నెల్లూరుకు తరలించారు. పోలీసులు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది మా త్రమే అంబులెన్స్‌లకు ఫోన్లు చేసి పిలిపించారు. ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్య వైఖరి విమర్శలకు దారి తీసింది.  
 
 మోటార్ సైకిల్‌ను ఢీకొన్న ట్రాక్టర్
  యువకుడి మృతి
 
 జలదంకి, న్యూస్‌లైన్ : మోటార్‌సైకిల్‌ను ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో మండలంలోని కొత్తపాళెంకు చెందిన గునుపాటి రమేష్‌రెడ్డి (22) అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో కొత్తపాళెం కావలి కాలువ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. కొత్తపాళెంకు చెందిన గునుపాటి రామచంద్రారెడ్డి రాత్రి 9.30 గంటలకు కావలి నుంచి గుడ్లదొన ఆర్టీసీ బస్సులో కొత్తపాళెంకు వచ్చాడు. అయితే బస్సులో కొన్ని వస్తువులు మరిచిపోయాడు. దీంతో కుమారుడు రమేష్‌రెడ్డిని బస్సు వద్దకు వెళ్లి వస్తువులు తీసుకు రావాల్సిందిగా మోటార్ సైకిల్‌పై పంపించాడు. రమేష్‌రెడ్డి గుడ్లదొనకు వెళుతుండగా గుడ్లదొన నుంచి కట్టెల లోడుతో డోర్లు తెరుచుకుని ట్రాక్టర్ వస్తుంది. కావలి కాలువ సమీపంలో బైక్‌పై వెళుతు న్న రమేష్‌రెడ్డిని ట్రాక్టర్ ఢీ కొంది. ట్రాక్టర్‌కు ఒక లైటు మాత్రమే ఉండటంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.  రమేష్‌రెడ్డి మృతదేహాన్ని కొత్తపాళెంకు తరలించారు. దీనిపై జలదంకి పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ట్రాక్టర్ కలిగిరి మండలం గుడ్లదొనకు చెందినదిగా తెలుస్తుంది. ట్రాక్టర్‌ను గ్రామస్తులు స్వాధీనం చేసుకున్నారు.
 
 పొట్టు బస్తాల మాటున ఎర్రచందనం రవాణా
 ప్రమాదంతో వెలుగులోకి
 
 గూడూరు, న్యూస్‌లైన్: పొట్టు బస్తాల మాటున ఎర్రచందనం దుంగలను రవాణా చేస్తున్న విషయం రోడ్డు ప్రమాదంతో వెలుగులోకి వచ్చింది. దుంగలతో వెళుతున్న మినీలారీ ఓ బైక్‌ను ఢీకొనడంతో అక్రమ రవాణా గుట్టు రట్టయింది. చిల్లకూరుకు చెందిన గుడి రామిరెడ్డి శుక్రవారం అర్ధరాత్రి బైక్‌పై జాతీయరహదారిపై వెళుతుండగా పోటుపాళెం కూడలిలో ఓ మినీలారీ ఢీకొంది. రామిరెడ్డి కిందపడిపోవడంతో ఆందోళనకు గురైన డ్రైవర్ మినీలారీని అక్కడే వదిలేసి పరారయ్యాడు.
 
  సమాచారం అందుకున్న గూడూరు రూరల్ పోలీసు లు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా మినీలారీలో 23 ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. వీటి విలువ సుమారు రూ.1.50 లక్షలు ఉంటుందని లెక్కగట్టారు. మినీలారీకి నంబర్‌ప్లేటు లేకపోపోగా తాత్కాలికంగా ఓ నంబర్‌ను స్టిక్కర్‌లా వేసుకున్నారు. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గాయపడిన రామిరెడ్డిని చికిత్స నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 
  పంజా విసిరిన ఏసీబీ
 అక్రమార్కుల గుండెల్లో ఏసీబీ అధికారులు రైళ్లు పరిగెత్తించారు. ఏసీబీ నెల్లూరు డీఎస్పీ జె.భాస్కర్‌రావు ఆధ్వర్యంలో పలు ఆకస్మిక దాడులు జరిగాయి. కార్పొరేషన్, వైద్యఆరోగ్యశాఖ, ఆర్టీఏ కార్యాలయాలతో పాటు భీములవారిపాళెంలోని ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టుపై పలుమార్లు దాడులు చేసి అక్రమార్కులకు ముచ్చెమటలు పట్టించారు. లంచాలు తీసుకుంటున్న పలు శాఖల అధికారులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని జైలుకు పంపారు. మద్యం సిండికేట్ వ్యవహారంలో 45 మంది పోలీసు, ఎక్సైజ్ అధికారులపై శాఖాపరమైన విచారణకు నివేదికను ప్రభుత్వానికి పంపారు. అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణతో విశ్రాంత డీఎంహెచ్‌ఓ మాశిలామణితో పాటు మరో 10మంది వైద్యాధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఫిబ్రవరిలో జిల్లా ఖజానా కార్యాలయంలో ఎస్‌టీఓ శేషయ్య, ఏటీఓ మోహన్‌రావు, డ్రైవర్ థామస్, మార్చిలో పరిశ్రమల శాఖ కార్యాలయంలో సూపరింటెం డెంట్ సుబ్బారావు, అటెండర్ రత్తయ్య, ఏప్రిల్‌లో నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ తోరాటి మధుసూదన్‌ప్రసాద్, సత్తారు బాబురావు, తాళ్లపాక శ్రీని వాసులురెడ్డి, ఆగస్టులో ఓజిలి ఎస్సై కలికి జనార్దన్‌రెడ్డి, అటవీశాఖకు సంబంధించిన ఏపీఎఫ్‌డీసీ డివిజనల్ మేనేజర్ గనీబాషా లంచ ం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన సంఘటనలు సంచలనం సృష్టించాయి.
 
 ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
 నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్:తీవ్ర అనారోగ్యంతో మనస్థాపానికి గురైన ఓ వృద్ధుడు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నెల్లూరులోని బారాషహీద్ దర్గా ఆవరణలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేర కు.. తోటపల్లిగూడూరు మండలం కొత్తపాళెంకు చెందిన ఎస్‌కే ఖాసింసాహెబ్(65) బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. భార్య చనిపోవడంతో కుమార్తె మస్తానమ్మను పెంచేందుకు గంగపట్నంకు చెందిన మరో మహిళను వివాహం చేసుకున్నాడు.
 
 ఆమెకు ఓ కుమారుడు పుట్టిన తర్వాత భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు చోటుచేసుకున్నాయి. కుమారుడితో ఆమె వెళ్లిపోవడంతో కుమార్తెతో కలిసి ఖాసింసాహెబ్ పదేళ్ల కిందట గంగవరానికి చేరుకున్నాడు. గ్రామంలోని శివాలయం వద్ద ఉంటూ బేలుదారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన మద్యానికి బానిస  కావడంతో అనారోగ్యానికి గురయ్యాడు. వైద్యులకు చూపించినా ఫలితం కరువవడంతో మనస్థాపానికి గురై చెట్టుకు పంచెతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు అతని సెల్‌ఫోనులోని నంబర్ల ఆధారంగా కుమార్తె మస్తానమ్మతో పాటు ఒకటోనగర పోలీసులకు సమాచారమందించారు. ఒకటో నగర ఎస్సై వేమయ్య సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుమార్తె మస్తానమ్మకు అప్పగించారు.
 
  చెలరేగిన దొంగలు
 ఈ ఏడాదిలో దొంగల హస్తలాఘవానికి అడ్డే లే కుండా పోయిం ది. రాత్రి, పగలు అనే తేడా లేకుం డా చెలరేగిపోయి అందిన కాడికి దోచుకెళ్లారు. జిల్లా వ్యాప్తంగా సుమారు రూ. 10 కోట్ల సొత్తు దొంగల పాలయిం ది. ఐదు డెకాయిటీలు, 40 దోపిడీలు, తొమ్మిది మర్డర్ ఫర్‌గెయిన్, 2,593 చోరీ కేసులు నమోదయ్యాయి. సుమారు రూ.6 కోట్ల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకుని పలువురిని జైలుకు పంపారు. చైన్ స్నాచర్లు చెలరేగిపోయారు. కొందరు దుండగులు ఇళ్లలోకి దూరి ప్రాణాలు తీసేందుకు కూడా వెనకాడ లేదు. కొందరైతే పోలీసుల ముసుగులోనే స్వైరవిహారం చేశారు.  
 
 బంగారు గొలుసు చోరీ
 గూడూరు టౌన్, న్యూస్‌లైన్:నడిచి వెళుతున్న మహిళ మెడలోని బంగారు గొలుసును బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు లాక్కెళ్లినట్లు శనివారం ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసుల కథనం మేరకు.. పెల్లేటివారివీధికి చెందిన వెంకటేశ్వర్లు, వెంకటలక్ష్మి శుక్రవారం రాత్రి నెల్లూరుకు వచ్చి గూడూరుకు వచ్చారు. పెల్లేటివారి వీధికి నడిచివెళుతుండా ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి ఆమె మెడలోని ఏడు సవర్ల బంగారు గొలుసును లాక్కెళ్లారు. గొలుసు విలువ రూ.2 లక్షలు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 
 వాకాడు ఐటీఐ ప్రిన్సిపల్ సస్పెన్షన్
 -మరో ముగ్గురు కూడా...
 వాకాడు, న్యూస్‌లైన్: విద్యార్థులను పాస్ చేయిస్తానని వారి నుంచి పెద్ద ఎత్తు న డబ్బు వసూళ్లు చేసిన వాకాడ ఐటీఐ ప్రిన్సిపల్ కరిముల్లాతో పాటు ఉపశిక్షణాధికారి శైలజ, కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు రవి, కిరణ్‌ను శనివారం సస్పెండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఉపాధికల్పనశాఖ అధికారులు ఆదేశాలిచ్చారు. గత అక్టోబర్‌లో ప్రిన్సిపల్, ఉపశిక్షణాధికారి, కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు విద్యార్థుల నుంచి దాదాపు రూ.2.80 లక్షలు వసూళ్లు చేశారు. ఈ విషయమై విద్యార్థులు నెల్లూరు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఏసీబీ అధికారుల దాడిలో ప్రిన్సిపల్‌తో పాటు మరో ముగ్గురు పట్టుబడ్డారు. వీరి నుంచి ఏసీబీ అధికారులు రూ.2.80 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో వీరు నిందితులని తేలడంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
 
 ఏసీబీకి చిక్కిన వారికి చార్జిమెమోలు
 బీవీపాళెం(తడ), న్యూస్‌లైన్: ఇటీవల కాలంలో రెండు సార్లు ఏసీబీ నిర్వహించిన దాడుల్లో అక్రమాలకు పాల్పడుతూ పట్టుబడిన వివిధ శాఖల ఉద్యోగుల నుంచి వివరణ కోరుతూ చార్జిమెమోలు జారీచేసినట్లు భీములవారిపాళెం ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టు పరిపాలనాధికారి మల్లికార్జునరావు శనివారం తెలిపారు. రెండు సందర్భాల్లో ఒకే బ్యాచ్‌కు చెందిన ఉద్యోగులు ఉండటంతో సమస్యను తీవ్రంగా పరిగణించి మెమోలు జారీ చేశామని చెప్పారు. ఎక్సైజ్ శాఖలో ఐదుగురికి, రవాణా శాఖలో నలుగురికి, వాణిజ్యపన్నుల శాఖలోని వివిధ విభాగాలకు చెందిన 13 మందికి మెమోలు జారీ అయ్యాయన్నారు. వాటికి వారం రోజుల్లోగా రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు. వారిచ్చిన సమాధాన పత్రాలను ఆయా శాఖల ఉన్నతాధికారులకు పంపి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.
 
 ఎలక్ట్రికల్ వస్తువుల ఆటో సీజ్
 సీఎస్‌టీ అడ్వాన్స్ వేబిల్లు లేకుండా చెన్నై నుంచి తడలోని పరిశ్రమలకు ఎలక్ట్రికల్ వస్తువులతో వస్తూ, చెక్‌పోస్టు వద్ద ఆగకుండా వెళ్లిన ఓ ట్రక్కు ఆటోను వెంబడించి పట్టుకున్నట్లు ఏఓ తెలిపారు. ఈ ఆటోలో రూ.3, 21, 339  విలువైన విద్యుత్ వైర్లు, బల్బులు, స్విచ్‌లు తదితర విద్యుత్ వస్తువులు ఉన్నాయన్నారు. హైదరాబాదుకు చెందిన కాంట్రాక్టర్ పేరున మీదున్న సరుకును తరలిస్తున్న ఈ ఆటోపై కేసు నమోదు చేసి గూడూరు సీటీఓ కార్యాలయానికి అప్పగించినట్టు ఏఓ చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement