సాక్షి, కృష్ణా: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కృష్ణా నదిలోకి దూకిన ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన మోపిదేవి మండలం పెదకళ్లేపల్లిలో జరిగింది. వివరాలివి.. కొంతమంది వ్యక్తులు కృష్ణా నది సమీపంలో పేకాట అడుతున్నారు. సమాచారం అందుకున్న చల్లపల్లి పోలీసులు పేకాట శిబిరంపై దాడి చేశారు. పోలీసులను గమనించిన పేకాటరాయుళ్లు తప్పించుకునే ప్రయత్నాం చేశారు.
వారిలో ముగ్గురు పక్కానే ఉన్న కృష్ణా నదిలో దూకారు. ఈ ఘటనలో రామాంజీనేయులు అనే వ్యక్తి నదిలో మునిగి చనిపోయాడు. అతని మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment