డివైడర్ను ఢీకొట్టిన కారు: ముగ్గురి మృతి
కనగానిపల్లె: అతివేగంతో వెళ్తోన్న ఓ కారు టైర్ పంక్చర్ అవడంతో అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతిచెందారు. ఈ ఘటన అనంతపురం జిల్లా కనగానిపల్లె మండలం మామిళ్లపల్లి వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఓ కుటుంబం వెళ్తోంది.
అయితే, ప్రమాదవశాత్తూ కారు అదుపుతప్పింది. రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను ఢీకొట్టి కారు బోల్తాపడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతిచెందగా, మరో ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. మృతులలో ఇద్దరు మహిళలు, ఓ డ్రైవర్ ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.