జాతీయ రహదారిపై కారు బోల్తా.. ఇద్దరు మృతి | A car slipped on national highway 2 people died | Sakshi
Sakshi News home page

జాతీయ రహదారిపై కారు బోల్తా.. ఇద్దరు మృతి

Published Sun, Feb 8 2015 2:44 PM | Last Updated on Sat, Sep 2 2017 9:00 PM

A car slipped on national highway 2 people died

అనంతపురం: కారు బోల్తాపడటంతో ఇద్దరు మృతిచెందగా మరో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి... గొరెంట్ల మండల పాలసముద్రం సమీపంలో 44వ జాతీయ రహదారి వద్ద కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కర్ణాటకకు చెందిన మునుస్వామి, హేమలత మృతిచెందగా, మరో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం వెంటనే కర్ణాటకలోని చిక్బల్లాపూర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తివివరాలు ఇంకా తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement