రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా నార్సింగి వద్ద ఔటర్ రింగురోడ్డుపై ఆగి ఉన్న లారీని ఓ కంటెయినర్ ఢీకొట్టింది. సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.