కుందుర్పి: అనంతపురం జిల్లా కుందుర్పి మండలం మలయనూరు సమీపంలో పెళ్లి బృందంతో వెళుతున్న ఓ ట్రాక్టర్ ఆదివారం అర్ధరాత్రి సమయంలో బోల్తా పడింది. ఈ ఘటనలో ఓబయ్య(24) అనే యువకుడు మృతి చెందగా, పది మందికి గాయాలు అయ్యాయి. వీరిలో కొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. కుందుర్పిలో పెళ్లి పూర్తి చేసుకుని సుమారు 30 మంది ట్రాక్టర్‌లో కర్ణాటకలోని నాగేపల్లికి బయల్దేరగా మలయనూరు సమీపంలో అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తాపడింది. క్షతగాత్రులకు కల్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.