ఉరవకొండ : ఇసుక లోడ్తో వెళ్తున్న ఓ ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడి ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం లింబగల్లు వద్ద చోటుచేసుకుంది. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.