tractor slipped
-
పెళ్లి ట్రాక్టర్ బోల్తా, ఒకరి మృతి
కుందుర్పి: అనంతపురం జిల్లా కుందుర్పి మండలం మలయనూరు సమీపంలో పెళ్లి బృందంతో వెళుతున్న ఓ ట్రాక్టర్ ఆదివారం అర్ధరాత్రి సమయంలో బోల్తా పడింది. ఈ ఘటనలో ఓబయ్య(24) అనే యువకుడు మృతి చెందగా, పది మందికి గాయాలు అయ్యాయి. వీరిలో కొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. కుందుర్పిలో పెళ్లి పూర్తి చేసుకుని సుమారు 30 మంది ట్రాక్టర్లో కర్ణాటకలోని నాగేపల్లికి బయల్దేరగా మలయనూరు సమీపంలో అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తాపడింది. క్షతగాత్రులకు కల్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. -
ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి
సూర్యాపేట రూరల్(నల్లగొండ): చెరువు కట్టపైగా వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి చెరువులో పడి పోవటంతో డ్రైవర్ మృతి చెందాడు. నల్లగొండ జిల్లా సూర్యాపేట మండలం పిల్లలమర్రి సమీపంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. పట్ల ఉప్పలయ్య(34) ట్రాక్టర్ నడుపుకుంటూ పిల్లలమర్రి గ్రామానికి చెరువు కట్టపై వెళ్తున్నాడు. అయితే ప్రమాదవశాత్తూ అదుపుతప్పిన ట్రాక్టర్ చెరువులో పడిపోవటంతో తీవ్రంగా గాయపడిన ఉప్పలయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. -
ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు మహిళల మృతి
ఒంగోలు : ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం వీరాయపాలెం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతిచెందారు. ట్రాక్టర్ బోల్తాపడిన ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మృతిచెందగా, మరో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
ట్రాక్టర్ బోల్తా పడి ఒకరి మృతి
ఉరవకొండ : ఇసుక లోడ్‌తో వెళ్తున్న ఓ ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడి ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం లింబగల్లు వద్ద చోటుచేసుకుంది. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది. -
ట్రాక్టర్ బోల్తా, వృద్ధుడి మృతి
కుంటాల(ఆదిలాబాద్ జిల్లా): పొలానికి ఎరువును తరలిస్తుండగా ట్రాక్టర్ బోల్తాపడి ఒక వృద్ధుడు మరణించాడు. ఈ సంఘటన గురువారం తెల్లవారుజామున ఆదిలాబాద్ జిల్లా కుంటాల మండలం అంబగంటి గ్రామం సమీపంలో జరిగింది. ఈ ఘటన వివరాలు.. గ్రామానికి చెందిన ఒట్టి రాజన్న(75) వ్యవసాయ కూలీగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే గురవారం ఉదయం పంట పొలానికి ఎరువును తరలించేందుకు ట్రాక్టర్‌పై వెళ్తుండగా గ్రామ సమీపంలోని పొలాల్లో బోల్తాపడటంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రాక్టర్ బోల్తా.. 20 మందికి గాయాలు
అశ్వారావుపేట(ఖమ్మం): ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం పాతమామిళ్లవారిగూడెం వద్ద గురువారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఇరవై మంది గాయపడ్డారు. పాతమామిళ్లవారిగూడెం, ఉసిర్లగూడెం గ్రామాలకు చెందిన ఇరవై మంది కూలీలు ట్రాక్టర్లో సమీపంలోని పొగాకు తోటలో పనికి బయలుదేరారు. అయితే, ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో అందులో ఉన్న 15 మంది స్వల్పంగా, 5గురు తీవ్రంగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను 108 వాహనంలో అశ్వారావుపేట, వినాయకపురంలలోని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు.