సూర్యాపేట రూరల్(నల్లగొండ): చెరువు కట్టపైగా వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి చెరువులో పడి పోవటంతో డ్రైవర్ మృతి చెందాడు. నల్లగొండ జిల్లా సూర్యాపేట మండలం పిల్లలమర్రి సమీపంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. పట్ల ఉప్పలయ్య(34) ట్రాక్టర్ నడుపుకుంటూ పిల్లలమర్రి గ్రామానికి చెరువు కట్టపై వెళ్తున్నాడు. అయితే ప్రమాదవశాత్తూ అదుపుతప్పిన ట్రాక్టర్ చెరువులో పడిపోవటంతో తీవ్రంగా గాయపడిన ఉప్పలయ్య అక్కడికక్కడే మృతిచెందాడు.