ఒంగోలు : ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం వీరాయపాలెం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతిచెందారు. ట్రాక్టర్ బోల్తాపడిన ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మృతిచెందగా, మరో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.