అశ్వారావుపేట(ఖమ్మం): ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం పాతమామిళ్లవారిగూడెం వద్ద గురువారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఇరవై మంది గాయపడ్డారు. పాతమామిళ్లవారిగూడెం, ఉసిర్లగూడెం గ్రామాలకు చెందిన ఇరవై మంది కూలీలు ట్రాక్టర్‌లో సమీపంలోని పొగాకు తోటలో పనికి బయలుదేరారు. అయితే, ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో అందులో ఉన్న 15 మంది స్వల్పంగా, 5గురు తీవ్రంగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను 108 వాహనంలో అశ్వారావుపేట, వినాయకపురంలలోని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు.