రాయచోటి(వైఎస్సార్ జిల్లా): వైఎస్సార్ జిల్లా చిన్నమండ్యం వద్ద ఆదివారం అర్థరాత్రి జరిగిన ప్రమాదంలో ఒకరు చనిపోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సంబేపల్లి మండలం శెట్టిపల్లికి చెందిన అర్జున్, రాయచోటి సంజీవ్‌నగర్‌కు చెందిన ఆది బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ వాహనదారులు రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అర్జున్ చికిత్సపొందుతూ చనిపోగా ఆది పరిస్థితి విషమంగా ఉంది.