బైక్‌పై నుంచి జారిపడి వ్యక్తి మృతి | one died in ananthapur due to bike skip | Sakshi
Sakshi News home page

బైక్‌పై నుంచి జారిపడి వ్యక్తి మృతి

Published Fri, Jan 1 2016 3:03 PM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM

one died in ananthapur due to bike skip

అనంతపురం: అనంతపురం జిల్లా కూడేరు మండలం శివరాంపేట వద్ద శుక్రవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తూ బైక్‌పై నుంచి జారిపడి ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. మృతిచెందిన వ్యక్తిని అనంతపురంకు చెందిన ఆంజనేయులు(40)గా గుర్తించారు. ఆంజనేయులుతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఒకే బైక్‌పై ఉరవకొండకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మిగతా ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement