బైక్పై నుంచి జారిపడి వ్యక్తి మృతి
అనంతపురం: అనంతపురం జిల్లా కూడేరు మండలం శివరాంపేట వద్ద శుక్రవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తూ బైక్పై నుంచి జారిపడి ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. మృతిచెందిన వ్యక్తిని అనంతపురంకు చెందిన ఆంజనేయులు(40)గా గుర్తించారు. ఆంజనేయులుతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఒకే బైక్పై ఉరవకొండకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మిగతా ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.