నల్గొండ జిల్లా తిప్పర్తి శివారులోని నార్కెట్‌పల్లి-అద్దంకి జాతీయ రహదారిలో టోల్‌ప్లాజా వద్ద ఒక కారు గురువారం సాయంత్రం బీభత్సం సృష్టించింది.
తిప్పర్తి (నల్గొండ జిల్లా) : నల్గొండ జిల్లా తిప్పర్తి శివారులోని నార్కెట్‌పల్లి-అద్దంకి జాతీయ రహదారిలో టోల్‌ప్లాజా వద్ద ఒక కారు గురువారం సాయంత్రం బీభత్సం సృష్టించింది. వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. తర్వాత ఎదురుగా వస్తున్న మిల్లర్ వెహికల్‌ను, ఆటోను ఢీకొట్టింది.
ఈ సంఘటనలో ఆటో డ్రైవర్ వేణు అక్కడికక్కడే మృతిచెందగా ద్విచక్రవాహనంపై వెళుతున్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి వేగంగా నడిపి ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కారు డ్రైవర్ మద్యం తాగి ఉన్నాడని స్థానికులు చెబుతున్నారు.