Thipparthy
-
తిప్పర్తి: ఆపదలో ఆదుకునే వ్యక్తిని ..
సాక్షి, తిప్పర్తి : నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ఆపదలో ఆదుకునే వ్యక్తిగా తనను ఐదవసారి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని ఇండ్లూరు, మామిడాల, యాపలగూడెం, ఆరెగూడెం, గోదోరి గూడెం, ఎల్లమ్మగూడెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో కోమటిరెడ్డికి పూలమాలలు, హారతులతో స్వాగతం పలికారు. గ్రామాల్లోని వీధులగుండా ప్రచార వాహనంపై తిరుగుతూ చేయి గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఆయా కార్యక్రమాల్లో దుబ్బాక నర్సిం హారెడ్డి, జెడ్పీటీసీ తండు సైదులుగౌడ్, టీడీపీ నాయకులు మాదగోని శ్రీనివాస్‌గౌడ్, చింతకుంట్ల రవీందర్‌రెడ్డి, లింగారావు, లక్ష్మణ్‌రావు, వెంకన్న, పాదూరి నాగమణి, శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణ, శరత్‌బాబు, ఈదయ్య, అంబేద్కర్, నామచక్రవర్తి, గోదా వెంకట్‌రెడ్డి, పాపిరెడ్డి, సుధాకర్‌రెడ్డి, నామ చంద్రయ్య, పాశం సంజీవరెడ్డి, బద్దం సైదులు తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ : ‘నా జీవితం ప్రజలకే అంకితం.. నాకున్న ఒక్కగానొక్క కొడుకు కూడా లేడు.. మీరే నా బిడ్డలు’ అని నల్లగొండ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన 25వ వార్డు పాతపల్లె ప్రజలనుద్దేశించి మాట్లాడారు. చదువు, ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా పాత పల్లె వారికి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతో అక్కడి గ్రామస్తులంతా ఇది పాతపల్లెకాదు ఇక నుంచి కోమటిరెడ్డి పల్లె అంటూ నినాదాలు చేశారు. అంతకు ముందు గ్రామస్తులు గ్రామ శివారునుంచి ఆటపాటలతో స్వాగతం పలికారు. చిన్నారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఆయన వెంట కూటమి నాయకులు మాదగోని శ్రీనివాస్‌గౌడ్, రియాజ్, పన్నాల గోపాల్‌రెడ్డి, కోఆప్షన్ సభ్యులు ఇబ్రహీం, మేకల కృష్ణ, భిక్షం, తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వార్తాలు... -
కారు బీభత్సం: ఒకరు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం
తిప్పర్తి (నల్గొండ జిల్లా) : నల్గొండ జిల్లా తిప్పర్తి శివారులోని నార్కెట్‌పల్లి-అద్దంకి జాతీయ రహదారిలో టోల్‌ప్లాజా వద్ద ఒక కారు గురువారం సాయంత్రం బీభత్సం సృష్టించింది. వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. తర్వాత ఎదురుగా వస్తున్న మిల్లర్ వెహికల్‌ను, ఆటోను ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఆటో డ్రైవర్ వేణు అక్కడికక్కడే మృతిచెందగా ద్విచక్రవాహనంపై వెళుతున్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి వేగంగా నడిపి ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కారు డ్రైవర్ మద్యం తాగి ఉన్నాడని స్థానికులు చెబుతున్నారు. -
ప్రేమజంట బలవన్మరణం
తిప్పర్తి (నల్లగొండ) : పురుగులమందు తాగి ఓ ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలో ఆలస్యంగా మంగళవారం వెలుగుచూసిన ఈ ఘటన వివరాల్లో కి వెళ్తే.. మిర్యాలగూడ మండలం జాప్తివీరప్పగూడేనికి చెందిన సండ్రల నవనీత (21), నిడమనూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన జక్కలి నరేష్ (21) మిర్యాలగూడలోని ఓ కాలేజీలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నారు. రెండేళ్లుగా వీరు ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలియడంతో నవనీతకు ఈ నెల 2న వేరే వ్యక్తితో వివాహం జరిపించారు. దీంతో మనస్తాపానికి గురయ్యారు. ఈ నెల 7న ఇళ్ల నుంచి వెళ్లిపోయి తిప్పర్తి మండలం మాడ్గులపల్లి సమీపంలో గల రైల్వేట్రాక్ పక్కన ఉన్న బత్తాయి తోటలో కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని తాగి ఆత్మహత్య చేసుకున్నారు. తోటలో రెండు మృతదేహాలు పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.