
టీడీపీ ఎమ్మెల్సీ కారు ఢీకొని వ్యక్తి మృతి
మదనపల్లి: టీడీపీ నేత వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లి సమీపంలోని దేవతానగర్‌లో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ఆ ఘటన వివరాలిలా ఉన్నాయి.. టీడీపీ ఎమ్మెల్సీ నరేష్‌కుమార్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు, ఎదురుగా వస్తున్న ఓ ఆటోను ఢీకొట్టింది.
దీంతో ఆటోలో ఉన్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వ్యక్తి ప్రస్తుతం కోమాలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.