ఆటోలు ఢీ: ఒకరి మృతి
జనగామ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 14 మందికి గాయాలయ్యాయి.
జనగామ : జనగామ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 14 మందికి గాయాలయ్యాయి. చంపక్‌హిల్స్ సమీపంలోని క్రషర్ మిషన్ వద్ద శుక్రవారం రెండు ఆటోలు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.
బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన కార్మికులు ఆటోలో సీతాఫలం పండ్లను తీసుకొస్తున్న క్రమంలో జనగామ వైపు వెళ్తున్న మరో ప్రయాణికుల ఆటోను ఢీకొంది. ఈ సంఘటనలో కొన్నెకు చెందిన తేలు రాజు(25) అనే కార్మికుడు మృతిచెందాడు. శంకరయ్య, రాకేష్ అనే వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా మరో 12మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.