
ఆటో-లారీ ఢీ: ఒకరు మృతి
మణుగూరు: కొత్తగూడెం జిల్లా మణుగూరు పాత కాట వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సాంబాయిగూడెంకు చెందిన ఆకుకూరల రైతులను ఎక్కించుకుని మణుగూరు వెళ్తున్న టాటా మేజిక్ ఆటోను మణుగూరు నుంచి సాంబాయిగూడెం వస్తున్న ఇసుక లారీ ఢీ కొట్టింది.
ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్ధానికుల సమాచారంతో ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.