సాక్షి, రామాపురం: వైఎస్సార్ జిల్లా రామాపురం మండలం పొత్తుకూరిపల్లి సమీపంలోని రిలయన్స్ పెట్రోల్ బంకు వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనం అదుపు తప్పి బోల్తా పడడంతో సంబేపల్లి మండలం పొట్టిరెడ్డిగారిపల్లెకు చెందిన చిన్నపరెడ్డి (60) మృతిచెందాడు. అదే గ్రామానికి చెందిన మహేష్‌కుమార్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.