సాక్షి, ఖాజీపేట : అయ్యప్పస్వామి దీక్ష అనంతరం శబరిమల వెళ్ళి అయ్యప్పస్వామిని దర్శించుకుని తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
వైఎస్సార్ జిల్లా ఖాజీపేట హైవేపై పెట్రోలు బంకు సమీపంలో ఆదివారం తుఫాన్ వాహనం గేదెలను తప్పించబోయి పక‍్కనున‍్న కల‍్వర్టును ఢీకొట్టింది. దీంతో వాహనంలో ఉన్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మతిచెందగా మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. కాగా... వీరందరూ శబరిమల నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment