
గూడూరు: గూడూరు–తిరుపతి మార్గంలో గాంధీనగర్ సమీపంలో తల లేని మొండెం రైలు పట్టాల పక్కనే పడి ఉంది. ఈ మేరకు స్థానికులు ఆదివారం గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే ఎస్సై బాలకృష్ణ ఘటనా స్థలానికి చేరకుని మృత దేహాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆయన తెలిపారు. కానీ రైలు పట్టాలను ఆనుకుని మొండెం పడి ఉండటం, ఆ ప్రాంతంలో ఎక్కడా తల కన్పించకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది.
మృతుడి వయస్సు సుమారు 50 నుంచి 55 ఏళ్లలోపు ఉంటుందని, బులుగు రంగు నిక్కరు, గళ్ల లుంగీ, లైట్ పింక్ కలర్ షర్ట్ ధరించి ఉన్నాడు. ఈ మేరకు స్థానికులు కూడా ఆ పరిసర ప్రాంతాల్లో మృతుడి తల కన్పిస్తుందేమోనని వెతికినా ఫలించలేదు. ఎవరైనా హత్య చేసి, అనుమానం రాకుండా రైలు పట్టాల వద్దకు తీసుకొచ్చి పడేశారా? లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడా! ప్రమాదవశాత్తు రైల్లోంచి పడి ఇలా మృతి చెందాడా అన్న పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతికిగల కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment