హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా సంఘీనగర్‌లో శుక్రవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. సంఘీనగర్‌లో నివసించే భాస్కర్‌రావు(65) సంఘీ పాలిమర్స్ సమీపంలో రోడ్డుపక్కన నడిచి వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన డీసీఎం ఢీకొట్టింది. తల పగిలి ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటన అనంతరం డీసీఎం డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలి పరారయ్యాడు. సంఘటన స్థలిని పోలీసులు పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.